పుష్ప రాజ్‌కి శ్రీవల్లి వెండి కానుక..!

ఐటెం సాంగ్‌ మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న పుష్ప 2 కి ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేయడం జరిగింది.

Update: 2024-11-10 07:26 GMT

అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సుకుమార్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. డిసెంబర్‌ 5న ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ సందడి మళ్లీ షురూ కాబోతుంది. పుష్ప పార్ట్‌ 1 సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏమాత్రం అంచనాలు లేకుండా, ప్రమోషన్ లేకుండా హిందీలో విడుదల అయిన పుష్ప పార్ట్‌ 1 సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. కనుక పుష్ప పార్ట్‌ 2 అక్కడ ఏ స్థాయి వసూళ్లను సొంతం చేసుకుందో కనీసం ఊహకు సైతం అందడం లేదు. ఐటెం సాంగ్‌ మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న పుష్ప 2 కి ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేయడం జరిగింది.


పుష్ప 2 సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న హీరోయిన్ రష్మిక ఇటీవల దీపావళి కానుకగా తనతోటి నటీనటులకు కానుకలను అందించడం జరిగింది. అల్లు అర్జున్‌కి సైతం దీపావళి సందర్బంగా వెండి కానుకతో ఉన్న స్వీట్ బాక్స్ ను రష్మిక మందన్న పంపించింది. ఆ బాక్స్‌తో పాటు వెండిని కానుకగా అందుకుంటే ఆ వ్యక్తికి అదృష్టం వరిస్తుందని మా అమ్మ చెప్పేవారు. అందుకే ఈ వెండి వస్తువు, స్వీట్స్ తప్పకుండా మీకు మరింత లక్‌ను తెచ్చి పెట్టాలని, ప్రేమను అందుకునేల చేస్తాయని నమ్ముతున్నాను అంటూ రష్మిక మందన్న గ్రీటింగ్‌ కూడా ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్‌ తనకు రష్మిక నుంచి అందిన దీపావళి కానుకను షేర్‌ చేశారు.

రష్మిక నుంచి అందుకున్న కానుకపై అల్లు అర్జున్‌ స్పందిస్తూ... థాంక్యూ మై డియర్‌, ప్రస్తుత సమయంలో మరెంతో అదృష్టం కావాలి అంటూ పోస్ట్‌ చేశారు. అల్లు అర్జున్‌ పోస్ట్‌ కి రష్మిక మళ్లీ స్పందిస్తూ... బాక్సాఫీస్‌ వద్ద మన పుష్ప 2 తప్పకుండా రూల్‌ చేయనుంది. మనం పడ్డ కష్టంకు త్వరలోనే ప్రతిఫలం లభిస్తుంది. ప్రేక్షకులు మన శ్రమను పుష్ప 2 రూపంలో గుర్తిస్తారు. పుష్ప 2 పై నేను చాలా నమ్మకంగా ఉన్నాను అంటూ రష్మిక మందన్న కామెంట్‌ చేసింది. మొత్తానికి వీరిద్దరి మధ్య సాగిన ఈ ఆసక్తికర పోస్ట్‌ లు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పాటు పుష్ప 2 కి మంచి రీచ్ తీసుకు వచ్చాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పుష్ప మొదటి పార్ట్‌లో హీరో పుష్ప రాజ్ ను ఎర్ర చందనం స్మగ్లర్‌గా చూపించడం జరిగింది. మరి పుష్ప 2 లో పుష్ప రాజ్‌ని దర్శకుడు సుకుమార్‌ ఎలా చూపిస్తాడా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు కేవలం థియేట్రికల్‌ ప్రీ రిలీజ్‌ బిజినెస్ ఏకంగా రూ.1000 కోట్లకు మించి జరిగింది. నాన్ థియేట్రికల్‌ బిజినెస్ రూ.400 కోట్లకు మించి జరిగిందని స్వయంగా నిర్మాతలు ప్రకటించారు. సినిమా బ్రేక్ ఈవెన్‌ కి రూ.1500 కోట్లకు మించి వసూళ్లు సాధించాల్సి ఉంది. చాలా ఏరియాల్లో బాహుబలి 2 సినిమా వసూళ్లను బీట్‌ చేస్తే తప్ప బ్రేక్‌ ఈవెన్‌ సాధ్యం అయ్యే పరిస్థితి లేదని బాక్సాఫీస్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. మరి అంతటి టార్గెట్‌ ను పుష్ప రాజ్ ఎలా రీచ్ అవుతాడాడు అనేది చూడాలి.

Tags:    

Similar News