రష్మిక ఆ టీమ్‌ని ఇబ్బంది పెడుతోందా? ఇదిగో అసలు నిజం
అనిల్ కపూర్, బాబి డియోల్ కీలక పాత్రల్లో నటించగా ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ మోస్ట్ వయోలెంట్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు
క్రేజీ స్టార్లలో కొంత మంది హీరోలు, హీరోయిన్లు సినిమా నిర్మాణానికి ముందు ఒకలా, రిలీజ్ టైమ్‌లో ప్రమోషన్స్ విషయంలో మరోలా ప్రవర్తిస్తూ భారీగా డిమాండ్ చేస్తుంటారు. ఈ విషయంలో చాలా సందర్భాల్లో రుజువైంది కూడా. అయితే తాను మాత్రం అందుకు పూర్తి భిన్నం అంటోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. రష్మిక నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ `యానిమల్`. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించారు.
అనిల్ కపూర్, బాబి డియోల్ కీలక పాత్రల్లో నటించగా ఈ మూవీని సందీప్ రెడ్డి వంగ మోస్ట్ వయోలెంట్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అంతే కాకుండా రీసెంట్గా విడుదల చేసిన ట్రైలర్లో రణ్ బీర్ కపూర్, రష్మికలపై చిత్రీకరించిన రొమాంటిక్ లిప్ లాక్ సీన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ప్రచార చిత్రాల్లోనే ఆ స్థాయిలో లిప్ లాక్ సీన్లు ఉంటే సినిమాలో ఏ రేంజ్లో ఉన్నాయో అనే చర్చ మొదలైంది.
అర్జున్ రెడ్డికి బాప్ల ఈ సినిమా ఉండనుందని, అంతకు మించిన స్థాయిలో లిప్ లాక్ సీన్లు ఈ మూవీలో ఉండనున్నాయని అంతా ఓ క్లారిటీకి వచ్చేశారు. రీసెంట్గా విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ కూడా వైరల్ కావడంతో `యానిమల్` టాక్ ఆఫ్ ది ఇండియాగా మారింది. సినిమాలో రష్మిక, రణ్ బీర్ ఇద్దరి మధ్య చాలా బోల్డ్ సీన్స్ ఉన్నాయనే టాక్ మొదలైంది. అంతే కాకుండా ఇందులో బోల్డ్‌గా నటించడానికి ముందు అనుకున్న రెమ్యునరేషన్‌కు మించి రష్మిక అదనంగా మేకర్స్ నుంచి వసూలు చేసిందనే కామెంట్లు తాజాగా వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తలపై రష్మిక టీమ్ స్పందించింది. రష్మిక బోల్డ్ సీన్ల కోసం టీమ్ నుంచి అదనంగా డిమాండ్ చేసిందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ముందు కథ విన్నప్పుడు ఎంత పారితోషికంని అడిగిందో దానికే కట్టుబడి ఉందని తెలిపింది. దీంతో రష్మికపై వస్తున్న వార్తలకు ఎండ్ కార్డ్ పడింది. ఇదిలా ఉంటే 'యానిమల్' మూవీని డిసెంబర్ 1న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.