ఎవరు అతడు? రియాతో బైక్ రైడ్‌కి వెళ్లాడు!
బెయిల్ పై రియా బయట యథేచ్ఛగా ఉంది. సుశాంత్ సింగ్ కేసు ఏళ్ల తరబడి విచారణలోనే నానుతూ ఉంది.
రియా చక్రవర్తి సినీకెరీర్, లైఫ్ జర్నీ, వివాదాస్పద జీవితం గురించి తెలిసినదే. బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌తో ప్రేమాయణం సాగించిన రియా రకరకాల ఆరోపణల్ని ఎదుర్కొంది. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చింది. కానీ నేరారోపణలు ఏవీ ఇంకా రుజువు కాలేదు. బెయిల్ పై రియా బయట యథేచ్ఛగా ఉంది. సుశాంత్ సింగ్ కేసు ఏళ్ల తరబడి విచారణలోనే నానుతూ ఉంది.
ఇక ఇదే సమయంలో రియా చక్రవర్తి ఒక ప్రముఖుడితో బైక్ షికార్ చేస్తూ కెమెరా కంట పడింది. బైక్ పై వెళుతూ ఇద్దరూ నల్లని మాస్కులు ధరించారు. అతడు మాస్క్ తో పాటు హెల్మెట్ పెట్టుకుని కనిపించడంతో ఎవరో గుర్తు పట్టడం కష్టంగానే ఉంది. కానీ నెటిజనుల్లో ఇది ఊహాగానాలకు కారణమైంది. ఆ బైక్ పై జంట షికార్ వెళుతున్నది రియా, ఆమె ప్రస్తుత ప్రియుడు అంటూ ప్రచారం సాగిస్తున్నారు. తన ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం తర్వాత నటి రియా చక్రవర్తి మళ్లీ ప్రేమను పొందినట్లు కనిపిస్తోందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో అతడితో బైక్‌పై రియా రైడ్ చేస్తూ కనిపించింది. ఆ సమయంలో రియా క్రాప్ టాప్, డెనిమ్ జీన్స్, క్రాప్డ్ డెనిమ్ జాకెట్ ధరించి కనిపించగా, అతడు బ్లాక్ షార్ట్ -బ్లాక్ బాంబర్ జాకెట్ సహా రిలాక్స్ డ్ క్యాజువల్స్ ధరించాడు. కానీ కెమెరామెన్లు వారిని వెంబడించారు. కెమెరాలతో ఫ్లాష్‌లు మెరిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.
అయితే ఇద్దరు స్నేహితులు అలా బైక్ పై వెళుతూ ఉండొచ్చు కదా! అని కొందరు పాజిటివ్ గా దీనిని చూస్తున్నారు. రియా చక్రవర్తి తన స్నేహితుడితో షికార్ కి వెళుతోందని సమర్థిస్తున్నారు. మరోవైపు రియా నటిగా అవకాశాలు అందుకోవడంలో ఇబ్బంది పడుతోంది. అయినా పట్టు వీడకుండా ప్రయత్నాలను కొనసాగిస్తోంది. ఇంతకుముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వర్ధంతి సందర్భంగా రియా చక్రవర్తి ఇన్‌స్టాలో ఒక రహస్య పోస్ట్‌ను షేర్ చేసారు. జూన్ 2020లో చనిపోయే ముందు సుశాంత్‌తో డేటింగ్ చేస్తున్న రియా తన సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రారంభం గురించి ఇండికేషన్ ఇచ్చింది. రీసెంట్ గా తన సోలో ట్రిప్ ఫోటోలను రియా షేర్ చేసింది. ఫోటోను షేర్ చేస్తూ.. రియా `#చాప్టర్ 2` అని రాసింది. రియా `చాప్టర్ 2` పేరుతో కొత్త యూట్యూబ్ పాడ్‌క్యాస్ట్‌ను కూడా షేర్ చేసింది. ఈ షోకి తొలి అతిథి సుస్మితా సేన్.
సుశాంత్ సింగ్ మరణం.. ఆ తర్వాత జరిగిన సంఘటనలు ప్రజలను ఆశ్చర్యపరిచాయి. జైలు జీవితం తర్వాత రియా పాజిటివ్ గా కెరీర్ పరంగా ముందుకు వెళ్లడంపై దృష్టి పెట్టింది. సుశాంత్ ఆత్మహత్యకు తానే కారకురాలు అనేది ఇప్పటికీ ఆరోపణలేనని రియా వాదిస్తోంది. అతడి మరణానికి సంబంధించిన డ్రగ్-సంబంధిత కేసులో రియాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అరెస్టు చేసింది. బెయిల్ మంజూరు కావడానికి ముందు రియా చక్రవర్తి బైకుల్లా జైలులో 28 రోజులు అండర్ ట్రయల్ ఖైదీగా గడిపింది.