డేంజర్ జోన్ లో సైంధవ్

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే

Update: 2024-01-16 02:30 GMT

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ తో కొంత క్యూరియాసిటీ క్రియేట్ చేయడంతో పాజిటివ్ వైబ్ వచ్చింది. దీంతో థియేటర్స్ లో ఈ సినిమా వర్క్ అవుట్ అవుతుందని అందరూ భావించారు. అయితే రిలీజ్ తర్వాత సైంధవ్ రిజల్ట్ మొత్తం మారిపోయింది.

సినిమాలో మెయిన్ కంటెంట్ బాగున్నా కూడా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేదనే టాక్ వినిపించింది. అలాగే సెంటిమెంట్ కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదని పబ్లిక్ నుంచి వచ్చిన స్పందన. ఇక మౌత్ టాక్ ఎవరేజ్ గా రావడంతో సినిమాకి ఆదరణ తగ్గిపోయింది. హనుమాన్ సూపర్ టాక్ తెచ్చుకొని ఓ వైపు దూసుకుపోతోంది.

మరో వైపు గుంటూరు కారం సినిమాకి మిక్సడ్ టాక్ వచ్చిన కూడా ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలిగే విధంగా ఉంది. నా సామి రంగా సినిమాకి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆడియన్స్ ఇంట్రెస్ట్ నుంచి సైంధవ్ సైడ్ అయిపొయింది. హనుమాన్, నా సామి రంగా సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు.

దీంతో సైంధవ్ కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. మూడు రోజుల్లో కేవలం 11 కోట్ల గ్రాస్ ని మాత్రమే కలెక్ట్ చేసింది. మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5.5 గ్రాస్ వసూళ్లు చేసిన తరువాత కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా 1100 థియేటర్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేశారు. అయితే ఎక్కడా కూడా ప్రభావం చూపించలేదు.

వెంకటేష్ 75వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. అయితే కెరియర్ లో ఒక మైలురాయి లాంటి మూవీని రాంగ్ టైమింగ్ లో రిలీజ్ చేశారనే మాట వినిపిస్తోంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ కథలని సంక్రాంతి సమయంలో చూడటానికి ఆడియన్స్ ఇష్టపడరని సైంధవ్ తో ప్రూవ్ అయ్యింది. గతంలో వెంకటేష్ SVSC, F2, గోపాల గోపాల సినిమాతో సంక్రాంతి రేసులో వచ్చి హిట్ కొట్టారు. ఈ సారి మాత్రం కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకోబోతున్నారని అర్ధమవుతోంది.

Tags:    

Similar News