తండేల్.. బుజ్జితల్లి అల్లరి చూశారా..
హీరోయిన్ సాయి పల్లవి.. చేసిందే తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో సంపాదించుకుంది.
హీరోయిన్ సాయి పల్లవి.. చేసిందే తక్కువ సినిమాలే అయినా క్రేజ్ మాత్రం ఓ రేంజ్ లో సంపాదించుకుంది. తెలుగు ఇండస్ట్రీలో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఏ హీరోయిన్ కు లేనంతగా పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లందరికీ భిన్నంగా ఉంటోంది. గ్లామర్ షో, మేకప్ కు పూర్తిగా దూరంగా ఉంటోంది ఈ బ్యూటీ.
తెరపై నేచురల్ గా నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది సాయి పల్లవి. డ్యాన్స్ లో కూడా అదరగొడుతోంది. ఆమె డ్యాన్స్ చేస్తుంటే అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. ప్రతి సినిమాలోనూ డ్యాన్స్ స్కిల్స్ చూపించే అవకాశాన్ని ఇస్తుంటారు మేకర్స్. అయితే ఈ బ్యూటీ బర్త్ డే నేడు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు, సినీ సెలబ్రిటీలు సాయి పల్లవికి బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.
అందులో భాగంగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న తండేల్ మేకర్స్ కూడా సాయి పల్లవికి స్పెషల్ విషెస్ తెలిపారు. అదిరిపోయే వీడియోను కూడా షేర్ చేశారు. అందులో సాయి పల్లవి నేచురల్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సౌత్ బ్యూటీ ఇప్పటికే నటించిన సినిమాల్లోని రోల్స్ ను చూపించారు మేకర్స్. ఆ తర్వాత సెట్స్ లో ఆమె చేసే అల్లరిని చిన్న చిన్న గ్లింప్స్ రూపంలో యాడ్ చేశారు. లంగా వోణీలు, చీరలు, చుడిదార్ డ్రెస్సుల్లో కుందనపు బొమ్మలా ఉంది సాయి పల్లవి.
సెట్స్ లో నాగ చైతన్యతో చిన్న పిల్లలా అల్లరి చేస్తోంది సాయి పల్లవి. అంతే కాదు చిన్న పిల్లలతో ఆడుకుంటున్న సీన్స్ కూడా యాడ్ చేశారు మేకర్స్. మొత్తానికి వీడియో అంతా ఎన్ని సార్లు చూసినా చూడాలనిపించే విధంగా ఉంది. సాయి పల్లవి పెర్ఫార్మెన్స్ లతో, షూటింగ్ సెట్స్ లో చేసే అల్లరితో, మంచి పనులతో ఈ మేకింగ్ వీడియో క్యూట్ గా అందరినీ ఆకట్టుకుంటోంది. తండేల్ మూవీలో సత్య పాత్రలో పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది సాయి పల్లవి.
ఇక లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ తండేల్. ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టొరీగా తండేల్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో నాగచైతన్య జాలరి పాత్రలో కనిపించబోతున్నారు. యథార్థ ఘటనల స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమా.. 2024 డిసెంబర్ లో విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ మూవీతో సాయి పల్లవి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి