సలార్‌ VS డుంకీ : వార్‌ వన్‌ సైడ్‌ లెక్కలు ఇదుగో

డిసెంబర్ లో విడుదల అవ్వబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన కొన్ని సినిమా లు బరి నుంచి తప్పుకుంటున్నాయి

Update: 2023-10-02 05:41 GMT

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్‌ సినిమా గత నెలలో విడుదల అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డ విషయం తెల్సిందే. వాయిదా పడ్డ సలార్ ని ఎప్పుడు ఎప్పుడు తీసుకు వస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో డిసెంబర్‌ లో క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

డిసెంబర్ లో విడుదల అవ్వబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన కొన్ని సినిమా లు బరి నుంచి తప్పుకుంటున్నాయి. కొన్ని మాత్రం సలార్ తో పోటీకి సిద్ధం అన్నట్లుగా నిలుస్తున్నాయి. అందులో ప్రధానమైన సినిమా బాలీవుడ్‌ బాద్‌ షా హీరోగా నటించిన 'డుంకీ' సినిమా ఒకటి.

ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజున రాబోతున్న నేపథ్యం లో ఇండియన్‌ బాక్సాఫీస్‌ ఆ రోజు.. ఆ వారం రోజులు ఎలా ఉంటుందా అంటూ ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షారుఖ్ తన గత రెండు సినిమాలతో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించాడు, ఇక ప్రభాస్‌ బాహుబలి తో, ప్రశాంత్‌ నీల్‌ కేజీఎఫ్‌ తో వెయ్యి కోట్ల క్లబ్‌ లో ఉన్న విషయం తెల్సిందే.

క్రిస్మస్‌ వార్‌ హోరా హోరీగా ఉంటుంది అనుకుంటూ ఉండగా సోషల్‌ మీడియాలో మాత్రం అంత సీన్ లేదు.. వార్‌ వన్‌ సైడ్‌ అవ్వబోతుంది. సలార్ ముందు డుంకీ తేలిపోవడం ఖాయం అన్నట్లుగా సోషల్‌ మీడియా లెక్కలు చెబుతున్నాయి అంటూ ప్రభాస్ అభిమానులు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.

సలార్ వర్సెస్‌ డుంకీ కి సంబంధించిన ఫేస్ బుక్‌ లో సలార్‌ గురించి 208K పోస్ట్‌ లు, డుంకీ గురించి 49K పోస్ట్‌ లు షేర్‌ అయ్యాయి. ఇన్‌ స్టా గ్రామ్‌ లో సలార్‌ గురించి 693 K పోస్ట్‌ లు కాగా, డుంకీ గురించి 75 K పోస్ట్‌ లు షేర్‌ అయ్యాయి. ఇక యూట్యూబ్‌ లో సలార్ గురించి 116 K వీడియో లు షేర్ అవ్వగా డుంకీ గురించి 16 K వీడియో లు మాత్రమే షేర్‌ అయ్యాయి.

ఈ లెక్కలు, నెంబర్స్ చూస్తూ ఉంటే ఏ రేంజ్‌ లో డుంకీ పై పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌, ప్రశాంత్‌ నీల్ ల మూవీ సలార్ డామినేషన్ చూపిస్తుందో అర్థం చేసుకోవచ్చు అన్నట్లుగా ప్రభాస్ ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే ట్రెండ్‌ సినిమా విడుదల అయిన తర్వాత కూడా కంటిన్యూ అయ్యేనా చూడాలి

Tags:    

Similar News