సలార్ ట్రైలర్.. ట్విస్ట్ ఏమిటంటే..

నిర్మాణ సంస్థ హోంబెల్ ప్రొడక్షన్స్ వారు ఏమాత్రం తగ్గకుండా సినిమా కు బజ్ పెంచే విధంగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు.

Update: 2023-11-10 08:03 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ సలార్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ లోనే రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వలన సినిమా డిసెంబర్ 22 కు షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. నిర్మాణ సంస్థ హోంబెల్ ప్రొడక్షన్స్ వారు ఏమాత్రం తగ్గకుండా సినిమా కు బజ్ పెంచే విధంగా ప్రస్తుతం అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అతిపెద్ద సలార్ కటౌట్స్ నిర్మించే విధంగా ప్రణాళిక రచించారు. ముఖ్యంగా ముంబై ఢిల్లీ లాంటి ప్రధాన నగరాల్లో సినిమా హై రేంజ్ లో కలెక్షన్స్ అందుకోవాలి అని ప్రత్యేకమైన ప్రమోషన్స్ కూడా చేసే విధంగా ఆలోచిస్తున్నారు. అయితే ప్రభాస్ మొత్తానికి విదేశాలనుంచి ఇటీవల తిరుగే హైదరాబాద్కు వచ్చేసాడు. ఇక ప్రభాస్ తోపాటు మరి కొంతమంది సినిమా నటీనటులు అలాగే దర్శకుడు అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేయడానికి వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.

అయితే సినిమాకు ఎంత ప్రమోషన్స్ చేసినా కూడా టైలర్ మాత్రం హై రేంజ్ లో ఉంటేనే బాక్సాఫీస్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ కూడా సాలిడ్ గా ఉంటాయి. ఇక ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ ట్రైలర్ను సిద్ధం చేసే పనిలోనే ఉన్నాడు. అయితే ఈసారి ట్విస్ట్ ఏమిటి అంటే టీజర్ తరహాలోనే ట్రైలర్ కూడా కట్ చేస్తున్నట్లు సమాచారం.

అంటే పాన్ ఇండియా తరహాలో వివిధ భాషల్లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఒకే ఒక్క ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీంతో ఆ ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనే దర్శకుడు ట్రైలర్ రెడీ చేసే విధంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఇది క్లిక్ అయితే మాత్రం రాబోయే రోజుల్లో ఇలాంటి ట్రైలర్స్ మరిన్ని వస్తాయి అని చెప్పవచ్చు. ఏదేమైనా ట్రైలర్ కోసం మాత్రం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ ఒకటవ తేదీన ట్రైలర్ విడుదల కానుంది. మరి సినిమాపై ట్రైలర్ ఏ రేంజ్ లో అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News