అభిమానుల‌కు స్టార్ హీరో ఊహించ‌ని స‌ర్ ప్రైజ్!

చాలా కాలంగా `కిక్-2` వ‌స్తుంద‌నే ప్రచారం బాలీవుడ్ మీడియాలో సాగింది గానీ ఇంత వ‌ర‌కూ క‌న్ప‌మ్ చేయ‌లేదు.

Update: 2024-10-04 09:22 GMT

స‌ల్మాన్ ఖాన్ హీరోగా సాజిద్ న‌డియావాలా స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన యాక్ష‌న్ కామెడీ `కిక్` ఎలాంటి విజ‌యం సాధించిందో తెలిసిందే. ర‌వితేజ న‌టించిన `కిక్` సినిమాకి రీమేక్ గా రూపొందిన సినిమా బాలీవుడ్ `కిక్` ఏకంగా 400 కోట్ల వ‌సూళ్ల‌ను సాధించింది. 140 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన చిత్ర‌మిది. మాతృక‌లో కిక్ ని సురేంద‌ర్ రెడ్డి తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా బాలీవుడ్ లో `కిక్ -2` ని ప్ర‌క‌టించారు.

చాలా కాలంగా `కిక్-2` వ‌స్తుంద‌నే ప్రచారం బాలీవుడ్ మీడియాలో సాగింది గానీ ఇంత వ‌ర‌కూ క‌న్ప‌మ్ చేయ‌లేదు. తాజాగా `సికిందర్‌` సెట్స్ నుంచే `కిక్ 2` ని ప్రకటించాడు దర్శక నిర్మాత సాజిద్‌ నడియావాలా. అలాగే `కిక్ 2` కు సంబంధించి స‌ల్మాన్ న్యూ లుక్ కూడా రిలీజ్ చేసారు. బ్లాక్ బనియన్‌లో స‌ల్మాన్ లుక్ అదిరిపోయింది. కండ‌ర గండ‌డు త‌న‌ద‌మైన మార్క్ ఎలివేష‌న్ తో ఆక‌ట్టుకుంటున్నాడు. ఇందులో స‌ల్మాన్ బ్యాక్ ఫోజులో హైలైట్ అవుతున్నాడు.

ఈ సారి సల్మాన్‌ డబుల్‌ కిక్ ఇచ్చేలా ఉన్నాడు. మరి ఇందులో హీరోయిన్ ఎవ‌రు? అంటే స‌మంత పేరు వినిపిస్తుంది. హీరోయిన్ గా ఆమెను తీసుకుంటున్నార‌నే ప్ర‌చారం ఉంది. అయితే ఈ విష‌యాన్ని మేక‌ర్స్ క‌న్ప‌మ్ చేయాల్సి ఉంది. ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ హీరోగా ముర‌గ‌దాస్ ద‌ర్శ‌కత్వంలో `సికింద‌ర్` తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఆన్ సెట్స్ లో ఉంది. ఎప్పుడు పూర్త‌వుతుంద‌న్న‌ది? ఇంకా క్లారిటీ లేదు.

రిలీజ్ మాత్రం వచ్చే ఏడాది ఉంటుంది. అనంత‌రం స‌ల్మాన్ కిక్-2 మొద‌లు పెట్టే అవ‌కాశం ఉంది. స‌ల్మాన్ నుంచి అధికారికంగా వ‌చ్చిన ప్రాజెక్ట్ ఇదే. ప‌లు ద‌ర్శ‌కుల‌తో స‌ల్మాన్ కి క‌మిట్ మెంట్లు ఉన్నాయి. కానీ వాటిని ఇంకా అఫీషియ‌ల్ గా ప్ర‌క‌టించ‌లేదు. కాబ‌ట్టి సికంద‌ర్ త‌ర్వాత `కిక్-2` సెట్స్ కెళ్తుంది. అలాగే భాయ్వ రుణ్ ధవన్‌ నటిస్తోన్న `బేబీజాన్‌`లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు.

Tags:    

Similar News