మ‌ళ్లీ కిక్ ఎక్కించ‌డానికి ఆ త్ర‌యం!

స‌ల్మాన్ ఖాన్- జాక్వెలిన్ పెర్నాడేంజ్-సాజిద్ న‌డియావాలా కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `కిక్` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.

Update: 2025-02-17 06:07 GMT

స‌ల్మాన్ ఖాన్- జాక్వెలిన్ పెర్నాడేంజ్-సాజిద్ న‌డియావాలా కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన `కిక్` ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. అప్ప‌టి వ‌ర‌కూ నిర్మాత‌గా ఉన్న సాజిద్ న‌డియావాలా ఈ సినిమాతోనే ద‌ర్శ‌కుడి ప‌రిచ‌యం అయ్యారు.ఈ చిత్రాన్ని ఆయ‌నే నిర్మించారు. అలా ద‌ర్శ‌కుడిగా , నిర్మాత‌గా గ్రాండ్ విక్ట‌రీని న‌మోదు చేసారు. ఆ త‌ర్వాత మ‌ళ్లీ సాజిద్ య‌ధావిదిగా నిర్మాత‌గానే కొన‌సాగారు త‌ప్ప ద‌ర్శ‌కుడి బాధ్య‌త‌లు తీసుకోలేదు.

ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌ళ్లీ రెండ‌వ సారి కెప్టెన్ కుర్చీ ఎక్క‌డానికి రెడీ అవుతున్నారు. `కిక్` చిత్రానికి సీక్వెల్ గా `కిక్ 2`ని ప్ర‌క‌టించారు. ఈ సినిమాకు తానే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌ళ్లీ స‌ల్మాన్ ఖాన్ నే హీరోగా తీసుకున్నాడు. హీరోయిన్ గా కూడా కొత్త వాళ్ల జోలికి వెళ్ల‌కుండా జాక్వెలిన్ నే మ‌ళ్లీ ఫైన‌ల్ చేసారు. తొలుత మ‌రో నాయికను తీసుకోవాల‌నుకున్నారు.

కానీ కామెడీ సినిమాలో జాకీ కంటే ఎవ‌రూ బెట‌ర్ గా క‌నిపించ‌క‌పోవ‌డంతో ఓల్డ్ భామకే ఫిక్స్ అయ్యారు. మొద‌టి భాగంలో జాకీ-స‌ల్మాన్ అద్బుత‌మైన కెమిస్ట్రీని వ‌ర్కౌట్ చేసారు. దీంతో రెండ‌వ భాగంలో అంత‌కు మించిన కెమిస్ట్రీ పండించాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. జూన్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని స‌న్నాహాలు చేస్తున్నారు.

ప్రస్తుతం స‌ల్మాన్ ఖాన్ ముర‌గదాస్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న `సికింద‌ర్` చిత్రంలో న‌టిస్తున్నారు. అటు సాజిద్ న‌డియావాల వివిధ సినిమాల నిర్మాణంలోనూ బిజీగా ఉన్నారు. ఇద్ద‌రు జూన్ క‌ల్లా ఖాళీ అవుతారు. అటుపై `కిక్ -2` ప‌నుల్లో నిమ‌గ్నం కానున్నారు.

Tags:    

Similar News