సమంత బ్యూటీకి..ఆ స్మైల్ కి కుర్రాళ్లంతా ఫిదా!
సాధారణ దుస్తుల్లోనే తనలో ఫ్యాషన్ క్వాలిటీని హైలైట్ చేయడంలో సామ్ ప్రత్యేకం.
సమంత స్టైలిష్ డిజైనర్ దుస్తుల్లో కనిపించడం రేర్. ఫోటో షూట్లు ఉంటే? తప్ప స్టైలిష్ ఎంపికల జోలికి వెళ్లదు. కానీ తనలో అంతకు మించిన ఫ్యాషన్ క్వాలిటీని మాత్రం ప్రతీ సందర్భంలో హైలైట్ చేస్తుంటుం ది. అందులో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును చూపుతుంది. సాధారణ దుస్తుల్లోనే తనలో ఫ్యాషన్ క్వాలిటీని హైలైట్ చేయడంలో సామ్ ప్రత్యేకం. తాజాగా అమ్మడి ఎయిర్ పోర్టు లుక్ ఒకటి లీకైంది.
ఇందులో అమ్మడు బ్లాక్ అండ్ జీన్స్ కాంబినేషన్ లో ఎంతో అందంగా కనిపిస్తుంది. మెష్ నెక్లైన్తో కూడిన పొరలుగా ఉన్న పొడవాటి నల్లని కార్డిగాన్ని టాప్ గా ఎంచుకుంది. దానికి మ్యాచింగ్ గా బ్లూ జీన్స్‌తో జత చేసింది. కళ్లకు బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించింది. ఇందులో అమ్మడు ఎంతో స్టైలిష్ గాను కనిపిస్తుంది. ట్రెండీగానూ హైలైట్ అవుతుంది. ఇలాంటి దుస్తులు ప్రయాణల సమయంలో ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.
ఎయిర్ పోర్ట్ నుంచి వస్తోన్న సమయంలో సమంత ఎంతో బిజీగా కనిపిస్తుంది. ఫోన్ కాల్ మాట్లాడుతూ హడావుడిగా నడచుకుంటూ వస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సాధారణ దుస్తుల్లోనే సమంత ఇంత అందంగా ఉందంటే? డిజైనర్ దుస్తుల్లో తనలో బ్యూటీ ని మాటల్లో వర్ణించగలమా. సమంత అభిమానులు తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో చాటుతున్నారు.
ఇక సమంత కెరీర్ ని మళ్లీ బిజీగా మార్చే పనిలో ఉంది. త్వరలోనే `సీటాడెల్` ఇండియన్ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని ఇండియాలో అన్ని చోట్లా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా సమంత ముంబైలోనే ఉంటుంది. అలాగే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలోనూ హడావుడిగా ఉంది.