భాయ్‌ని ఆడుకుంటున్న మాజీ ప్రియురాళ్లు

ఇంత‌కుముందు స‌ల్మాన్ ఖాన్ మాజీ ప్రేయ‌సి సోమీ అలీ స‌డెన్ గా టీవీ చానెళ్ల‌లో ప్ర‌త్యక్ష‌మై స‌ల్మాన్ తో నాటి ప్రేమ‌క‌థ‌ల్ని గుర్తు చేసుకుంది.

Update: 2025-01-01 16:30 GMT

పాత విష‌యాల‌నే టెలివిజ‌న్ లైవ్‌లో కొత్త‌గా చెబితే కిక్కొస్తుంది. అందులో కాంట్ర‌వ‌ర్శీ ఉంటే అన్‌లిమిటెడ్ మ‌జా వ‌స్తుంది. త‌ద్వారా టీవీ చానెల్ కి టీఆర్పీ కూడా పెరుగుతోంది. అయితే ఇలాంటి టీవీ షోలలో ఒక పెద్ద సూప‌ర్ స్టార్ ని టార్గెట్ చేస్తూ టీఆర్పీని రాబ‌ట్టుకోవాల‌నే ఆలోచ‌నే ఇప్పుడు షాకిస్తోంది.

ఇంత‌కుముందు స‌ల్మాన్ ఖాన్ మాజీ ప్రేయ‌సి సోమీ అలీ స‌డెన్ గా టీవీ చానెళ్ల‌లో ప్ర‌త్యక్ష‌మై స‌ల్మాన్ తో నాటి ప్రేమ‌క‌థ‌ల్ని గుర్తు చేసుకుంది. స‌ల్మాన్ ఖాన్ కృష్ణ జింక‌ను వేటాడి బిష్ణోయ్ గ్యాంగ్ కి చిక్కాడు. జైలులో ఈ కేసు ప‌రిష్కారం లేదు. స‌ల్మాన్ సారీ చెప్ప‌డమే స‌రైన‌ది అని టీవీ చానెళ్ల‌లో ఉచిత స‌ల‌హా కూడా ఇచ్చేసింది సోమీ. ఆ త‌ర్వాత అస‌లు చంపడాలు, చంపుకోవడాలేంటి నాన్ సెన్స్! అంటూ అటు బిష్ణోయ్ కి కూడా క్లాస్ తీస్కుంది. మాట‌ల్లేవ్ అన‌కుండా , మాట్లాడి ప‌రిష్క‌రించుకోవాల‌ని ఇరువ‌ర్గాలకు సూచించింది. ఇక స‌ల్మాన్ ఖాన్ ప్రేయ‌సిగా ఉన్న‌ప్పుడు తాను ఎదుర్కొన్న ఇక్క‌ట్ల‌ను కూడా టీవీ చానెల్ వేదిక‌గా ఏక‌రువు పెట్టింది. పాత కూర‌ల‌నే కొత్త‌గా వండ‌టంతో అవి చూసే నెటిజ‌నుల‌కు ఏదో కిక్కు వ‌చ్చింది.

ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్ మ‌రో మాజీ ప్రేయ‌సి కూడా ఇలాంటి ర‌చ్చే చేస్తోంది. టీవీ చానెల్ లైవ్ లోకి వ‌చ్చాక ఆమె చేసిన ఓ వ్యాఖ్య ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. ఇంత‌కీ ఎవ‌రీమె? అంటే.. ఐశ్వ‌ర్యారాయ్ తో సంబంధంలోకి రాక మునుపు స‌ల్మాన్ ఖాన్ ఘాఢంగా ల‌వ్ చేసిన సంగీతా బిజిలానీ. ఈమె క్రికెట‌ర్ మ‌హమ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ ని పెళ్లాడి ఆ త‌ర్వాత విడాకులు కూడా తీసుకుంది. బ్రేక‌ప్ త‌ర్వాత కూడా స‌ల్మాన్ కి స్నేహితురాలుగా కొన‌సాగింది. ఇంత‌కీ టీవీ చానెల్ ఇంట‌ర్వ్యూలో ఇప్పుడు సంగీత సూప‌ర్ స్టార్ స‌ల్మాన్ పై ఎలాంటి ఫిర్యాదు చేసింది? అంటే... అత‌డు త‌న‌పై విధించిన క‌ట్టుబాట్లతో క‌ష్టం గురించి ప్ర‌స్థావించింది. పొట్టి బ‌ట్ట‌లు వేసుకోవ‌ద్దు.. ఇలా ఉండాలి.. అలా ఉండాలి! అంటూ స‌ల్మాన్ చాలా కండిష‌న్లు పెట్టేవాడ‌ట. ప్రారంభంలో పొట్టి బ‌ట్ట‌లు వేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డేదానిని కాద‌ని, చాలా రిజ‌ర్వుడ్ గా ఉండేదానిని అని తెలిపిన సంగీత‌, నెమ్మ‌దిగా దాని నుంచి బ‌య‌ట‌ప‌డ్డాన‌ని తెలిపింది. అయితే తాను పొట్టి బ‌ట్ట‌లు ధ‌రించడాన్ని స‌ల్మాన్ స‌హించేవాడు కాద‌ని కూడా తెలిపింది. కార‌ణం ఏదైనా కానీ సంగీత బిజిలానీ కొన్నేళ్ల డేటింగ్ త‌ర్వాత స‌ల్మాన్ నుంచి విడిపోయింది. ఈ జంట ఆల్మోస్ట్ పెళ్లి వ‌ర‌కూ వెళ్లారు. కానీ కుద‌ర‌లేదు.

ఇటీవల సంగీత ఇండియన్ ఐడల్‌లో ప్రత్యేక అతిథిగా కనిపించింది. ఈ వేదిక‌పై సల్మాన్ ఖాన్ గురించి ఇలాంటి వ్యాఖ్య‌లు చేసింది. ఈ ఎపిసోడ్ నుండి క్లిప్ వైరల్ అయ్యింది. ఇది X లో వైర‌ల్ గా షేర్ అయింది. సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేసిన తర్వాత మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్‌ను సంగీత 1996లో వివాహం చేసుకుంది. అయితే, ఈ జంట విడిపోయి 2010లో విడాకులు తీసుకున్నారు. ఈ బ్రేక‌ప్ త‌ర్వాత‌ సంగీత .. సల్మాన్‌తో చాలాసార్లు షికార్లు చేస్తూ కనిపించింది. స‌ల్మాన్ పుట్టినరోజు వేడుకల‌కు కూడా హాజరయింది. కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... సంగీత చివరిసారిగా ఏబిసిడి (1997)లో కనిపించింది. ఇటీవ‌ల టీవీ రియాలిటీ షోలలో అతిథిగా కనిపిస్తోంది.

Tags:    

Similar News