చిన్నోడితో ఫైట్ పెద్దోడి రియాక్షన్ ఇదే..!
సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మీ చిన్నోడు థియేటర్లను లాగేసుకున్నారు
ఈ సంక్రాంతి ఫైట్ ఎప్పుడు లేని విధంగా ఐదు సినిమాల మధ్య జరుగుతుంది. సినిమాల రిలీజ్ లు ఎన్ని జరిగినా వాటికి థియేటర్లు అడ్జెస్ట్ చేయలేక సతమతమవ్వాల్సి వస్తుంది. ఈ సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్, తేజా సజ్జ హనుమాన్ ఇలా ఒకదానికి మరొకటి అన్న రేంజ్ లో ఈ సినిమాలు పొంగల్ ఫైట్ కి సిద్ధమవుతున్నాయి. అయితే థియేటర్ల సమస్య గురించి అందరు ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు. లేటెస్ట్ గా సైంధవ్ ట్రైలర్ రిలీజ్ టైం లో విక్టరీ వెంకటేష్ ని ఈ థియేటర్ల సర్దుబాట్ల గురించి అడిగారు.
సంక్రాంతికి మహేష్ గుంటూరు కారం భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో మీ చిన్నోడు థియేటర్లను లాగేసుకున్నారు. మీరు అనుకున్న థియేటర్లు దొరికాయా అని రిపోర్టర్ వెంకటేష్ ని అడిగారు. దానికి వెంకటేష్ సమాధానం ఇస్తూ దానికి నేనేమి ఫీలవ్వను.. మాకొచ్చినవి హ్యాపీగా తీసుకుంటాం అందరు బాగుండాలని అన్నారు. ఇలా కష్టమైన ప్రశ్నకు కూడా చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చి తన మార్క్ చాటుకున్నారు వెంకటేష్.
వెంకటేష్, మహేష్ ఇద్దరు కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ఈ సినిమాలో వెంకటేష్ పెద్దోడుగా.. మహేష్ చిన్నోడుగా నటించారు. ఈ సినిమాలో నటించినప్పటి నుంచి వెంకటేష్ మహేష్ మధ్య నిజమైన అన్నదమ్ముల సత్సంబంధం కొనసాగుతుంది. అందుకే మహేష్ గురించి ఎప్పుడు ప్రస్తావించినా సరే వెంకటేష్ చిన్నోడనే అంటుంటారు. ఇక వెంకటేష్ గురించి మహేష్ కూడా అన్నయ్య, పెద్దోడని ప్రస్తావిస్తారు.
అలా ఒక సినిమాతో ఏర్పడిన వీరి బంధం అలానే కొనసాగుతుంది. సంక్రాంతికి గుంటూరు కారం, సైంధవ్ రెండు సినిమాలు వస్తున్నా పెద్దోడు, చిన్నోడు కలిసి సంక్రాంతికి వస్తున్నామని అంటున్నారు. ఈ ఇద్దరి హీరోల మధ్య ఉన్న ఈ పాజిటివిటీ వారి ఫ్యాన్స్ మధ్య కూడా కనిపిస్తుంది. సంక్రాంతికి మహేష్ తో పాటు వస్తున్న సినిమాలు కూడా మంచి క్రేజ్ తో వస్తున్నాయి. మరి ఈ సినిమాల్లో ఏది అసలైన విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
సైంధవ్ ప్రెస్ మీట్ లో భాగంగా వెంకటేష్ తనకు బాగా నచ్చిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా రీ రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వెల్లడించారు. స్టార్ సినిమాలన్నీ రీ రిలీజ్ లు జరుగుతున్న ఈ టైంలో వెంకటేష్ సినిమాలేవి ఇప్పటివరకు రీ రిలీజ్ కాలేదు. అయితే వెంకటేష్ స్వతహాగా నువ్వు నాకు నచ్చావ్ సినిమా రీ రిలీజ్ చేస్తే బెటర్ అని చెప్పడం ఆ సినిమా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది.