బికినీలో చెల‌రేగిన న‌ట‌వార‌సురాలు

బాలీవుడ్ లో అత్యంత వేగంగా స్టార్ డ‌మ్ అందుకున్న న‌టవార‌సురాలిగా సారా అలీఖాన్ పేరు వినిపిస్తోంది.

Update: 2023-11-22 04:59 GMT

బాలీవుడ్ లో అత్యంత వేగంగా స్టార్ డ‌మ్ అందుకున్న న‌టవార‌సురాలిగా సారా అలీఖాన్ పేరు వినిపిస్తోంది. ఈ బ్యూటీ విల‌క్ష‌ణ ఎంపిక‌లు త‌న ఎదుగుద‌ల‌కు స‌హ‌క‌రిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు. ఇటీవ‌ల రొమాంటిక్ కామెడీల్లో న‌టించి భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న సారా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఒరిజిన‌ల్ సిరీస్ కోసం స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధురాలి పాత్ర‌లోను న‌టిస్తోంది. త‌న‌ను తాను నిరూపించుకోవ‌డానికి స్కోప్ ఉన్న పాత్ర‌తో అభిమానుల ముంద‌కు వ‌స్తోంది.


మ‌రోవైపు సారా సోష‌ల్ మీడియాల్లోను ఎంతో యాక్టివ్ గా ఉంది. తాజాగా సారా షేర్ చేసిన ఓ ఫోటోషూట్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఇందులో సారా బికినీ ధ‌రించి హాట్ గా క‌నిపించింది. టూపీస్ లో టోన్డ్ మ‌జిల్స్ ని ప్ర‌ద‌ర్శిస్తూ సారా ఇచ్చిన ఫోజ్ యువ‌త‌రాన్ని కిల్ చేస్తోంది. బ్లూ క‌ల‌ర్ టూపీస్ ధ‌రించిన సారా ఒక చేతిలో త‌న ఫోన్ ని ప‌ట్టుకుని ఇంకో చేతిని గాల్లోకి ఉంచింది. క‌ళ్ల‌కు ధ‌రించిన స్పెష‌ల్ గ్లాసెస్ త‌న లో హాట్ స్టైలిష్ ఎలివేష‌న్ ని మ‌రింత పెంచాయని చెప్పాలి. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.


సారా టూ హాట్ గా ఉందంటూ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో స్పందిస్తున్నారు. సారాపై ల‌వ్ హార్ట్ ఈమోజీల‌తో ప్రేమ‌ను కురిపిస్తున్నారు. ఒక అభిమాని ఇంట్రెస్టింగ్ గా స్పందించాడు. ``ఎందుకో నాకు తెలియదు కానీ నేను ఆమెను చూసిన తర్వాత నాకు చాలా సానుకూల వైబ్‌లు వచ్చాయి. ఆమె (సారా) చాలా బాగా పెరిగింది. క్రమశిక్షణ .. నిజమైన కోణంలో అక్షరాస్యత, ఈ క్రెడిట్ అంతా ఆమె మమ్మీకి చెందుతుంది.. `` అంటూ సారా అలీఖాన్ త‌ల్లి గారైన అమృతా సింగ్ ని ప్ర‌శంసించారు. సెడక్టివ్ మరియు అద్భుత సౌందర్యం అంటూ ఒక అభిమాని ప్రేమ‌ను కురిపించాడు.




Tags:    

Similar News