ఓటీటీలు దిగి రావాలంటే అదే జ‌ర‌గాలి!

చిన్న సినిమాల‌కు ఓటీటీ రిలీజ్ అన్న‌ది ఎంత భారంగా మారిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌క‌ర‌కాల ఆంక్ష‌ల మ‌ధ్య ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితి.

Update: 2024-12-22 20:30 GMT

చిన్న సినిమాల‌కు ఓటీటీ రిలీజ్ అన్న‌ది ఎంత భారంగా మారిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌క‌ర‌కాల ఆంక్ష‌ల మ‌ధ్య ఓటీటీలో రిలీజ్ చేయాల్సిన ప‌రిస్థితి. రిలీజ్ అనంత‌రం ఓటీటీ లో వచ్చిన రెస్పాన్స్ మీద‌నే పేమెంట్ ఆధార ప‌డుతుంది. థియేట్రిక‌ల్ రిలీజ్ లో స‌క్సెస్ అయితే ప‌ర్వాలేదు. కానీ పొర‌పాటుల ఫ‌లితం అటు ఇటు అయితే మాత్రం ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల్ని సైతం ఓటీటీలు బ్రేక్ చేసి వెళ్తున్నాయి. నిర్మొహ మాటంగా రిలీజ్ చేయ‌యని చెప్పేస్తున్నాయి. అలాగ‌ని పెద్ద సినిమాల కోసం ఓటీటీలో ఇంత‌కు ముందులా పోటీ ప‌డ‌టం లేదు.

మార్కెట్ ని ఆధారంగా చేసుకునే కంటెంట్ ని తీసుకుంటున్నాయి. సినిమా స‌క్సెస్ అయితే గ‌నుక ఓటీటీ రిమోట్ నిర్మాత చేతుల్లో ఉంటుంది. ఎప్పుడు కావాల‌నుకుంటే అప్పుడు రిలీజ్ చేస్తున్నారు. మ‌రి చిన్న సినిమాల‌కు ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చేదెప్పుడు? ఓటీటీ సంస్థ‌లు ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాల‌కు పెద్ద పీట వేసేదెప్పుడు? అంటే మాత్రం హిట్ ఒక్క‌టే మార్గంగా క‌నిపిస్తుంది. ఆ మ‌ధ్య మాలీవుడ్ నుంచి కొన్ని కంటెంట్ బేస్ట్ చిత్రాలు రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

అందులో పెద్ద స్టార్లు ఎవ‌రూ లేరు. కానీ ఆ సినిమాల్ని ఓటీటీలు భారీ ఆఫ‌ర్ ఇచ్చి మ‌రీ కొన్నాయి. థియేట‌ర్లో ఫెయిలైన కొన్ని సినిమాల్ని కూడా కొన్నాయి అదెలా అంటే? ఆ సినిమా కంటెంట్ ఓటీటీ ఆడియ‌న్స్ కి రీచ్ అవుతుంద‌నే న‌మ్మ‌కం యాజ‌మాన్యాలు క‌లిగితే రూపాయి ఎక్కుడ పెట్ట‌డానికే చూస్తున్నాయి. మ‌రి తెలుగు కంటెంట్ ని అలా ఎందుకు కొన‌డం లేదు? అంటే కంటెంట్ వైఫ‌ల్యం అనే మాట వినిపిస్తుంది.

మ‌రి ఈ ఫేజ్ ని దాటెదెలా? అంటే సినిమాలో భారీ కాస్టింగ్ లేక‌పోయినా క‌థ‌లో బ‌ల‌ముంటే ఏ ఓటీటీ అయినా ముందుకు రావ‌డానికి అవ‌కాశం ఉంటుంది. కోలీవుడ్, మాలీవుడ్ లో రిలీజ్ అవుతోన్న చిన్న సినిమాలు థియేట‌ర్లో ఫెయిలైనా ఓటీటీ లో స‌క్సెస్ అవుతున్నాయి? అంటే కంటెంట్ పై న‌మ్మ‌కంతోనే సంస్థ‌లు కొనుగోలు చేస్తున్నా య‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. వాళ్ల మార్కెట్ స్ట్రాట‌జీ ప్ర‌త్యేకంగా ఉంటుందంటున్నారు. క‌థ‌లో ఏదో ఒక పాయింట్ ప‌ట్టుకుని ఓటీటీ మార్కెట్ లో పాజిటివ్ బ‌జ్ క్రియేట్ చేస్తున్నార‌ని, ఈ ర‌క‌మైన ప‌బ్లిసిటీ ఇక్కడ సాధ్యం కాలేదు అన్న విమ‌ర్శ వినిపిస్తుంది.

Tags:    

Similar News