పెళ్లి కూతురిగా శోభిత.. అచ్చం కుందనపు బొమ్మే!
యంగ్ హీరో నాగ చైతన్యతో ఆమె మ్యారేజ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4వ తేదీన ఘనంగా జరగనుంది.
హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.. మరో రెండు రోజుల్లో వివాహ బంధంలో అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి డిసెంబర్ 4వ తేదీన అక్కినేని వారి ఇంటికి కోడలిగా వెళ్లనున్నారు. యంగ్ హీరో నాగ చైతన్యతో ఆమె మ్యారేజ్ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో డిసెంబర్ 4వ తేదీన ఘనంగా జరగనుంది.
ఇప్పటికే అక్కినేని, ధూళిపాళ్ల కుటుంబాల్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల క్రితం శోభితకు ఆమె కుటుంబ సభ్యులు.. శుభముహూర్తాన మంగళస్నానాలు చేయించారు. రాట స్థాపన కూడా చేశారు. ఆ సమయంలో చైతూ అక్కడ ఉన్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్ ను ఇప్పటికే శోభిత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇప్పుడు శోభితను సోమవారం ఉదయం పెళ్లి కూతురిగా ముస్తాబు చేశారు. అనంతరం అంతా కలిసి మంగళ హారతులు ఇచ్చారు. ఆ సమయంలో శోభిత రెడ్ కలర్ శారీలో మెరిసిపోతూ కనిపించారు. సిగ్గు లొలికించి కుందనపు బొమ్మలా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు శోభిత ఇప్పుడు.. తన ఫాలోవర్స్ కోసం నెట్టింట పంచుకున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో శోభిత పోస్ట్ చేసిన పిక్స్.. వైరల్ గా మారాయి. శోభిత ఎలిగెంట్ లుక్ లో కనిపిస్తున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేడమ్ అంటూ విషెస్ చెబుతున్నారు. పిక్స్ సూపర్ గా ఉన్నాయని అంటున్నారు. ఒక్కో ఫోటోలో తెలుగుదనం ఫుల్ గా ఉట్టిపడుతుందని చెబుతున్నారు.
అయితే నాగ చైతన్య, శోభిత మధ్య రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో ఇద్దరూ కలుసుకున్నారు. ఆ తర్వాత పలుమార్లు కలిసి కనిపించారు. దీంతో వారి మధ్య ఏదో ఉందని అంతా మాట్లాడుకున్నారు. కచ్చితంగా వారు ప్రేమలో ఉన్నారని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ వారిద్దరూ రివీల్ చేయలేదు.
సడెన్ గా కొద్ది రోజుల క్రితం.. హీరో నాగార్జున తన ఇంటికి శోభిత కోడలిగా రానున్నట్లు ప్రకటించారు. ఆమెకు, చైతూకు ఎంగేజ్మెంట్ జరిగినట్లు వెల్లడించారు. ఫోటోస్ షేర్ చేశారు. ఆ తర్వాత కొత్త జంట కూడా పోస్ట్ చేశారు. ఇప్పుడు నాలుగో తేదీ రాత్రి 8.13 గంటలకు మూడు ముళ్లతో బంధంతో ఒకటవ్వనున్నారు. ఎనీ వే హ్యాపీ అడ్వాన్స్ మ్యారీడ్ లైఫ్ శోభిత, చైతూ!