కొత్త పెళ్లి కూతురా నీకిది తగునా?
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-రైటర్ జహీర్ ఇక్బాల్ ఇటీవల పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా-రైటర్ జహీర్ ఇక్బాల్ ఇటీవల పెద్దల్ని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కొత్తగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. దంపతులిద్దరికీ సోనాక్షి తండ్రి ఓ ఖరీదైన ప్లాట్ కూడా గిప్టుగా ఇచ్చినట్లు ప్రచారంలోకి వచ్చింది. అందులోనే కొత్త కాపురం పెడుతున్నట్లు వైరల్ అయింది. ఆ సంగతి పక్కనబెడితే తాజాగా సోనాక్షి సిన్హా చెప్పులను భర్త జహీర్ ఇక్బాల్ ఓ షాపింగ్ మాల్ లో చేతులతో పట్టుకుని వెళ్తోన్న ఓ వీడియో వైరల్ అవుతోంది.
జహీర్ అలా చెప్పులు పట్టుకుని ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక ఉన్న సోనాక్షి సిన్హా ఆ సన్నివేశం మొత్తాన్ని వీడియో తీసి నెట్టింట పోస్ట్ చేసింది. మీకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకుంటే ఇలాగే ఉంటుందని ఆ వీడియోని ఉద్దేశించి ఓ పోస్ట్ కూడా పెట్టింది. దీంతో ఓ సెక్షన్ ఆడియన్స్ సోనాక్షి తీరుపై మండిపడుతున్నారు. కట్టుకున్న భర్తతో చెప్పులు మోయిస్తావా? అంటూ చీవాట్లు పెడుతున్నారు. అసలు చెప్పులు పట్టుకోవడం అన్నదే అతి పెద్ద తప్పు.
ఒకవేళ అలా చేసిన సరదాగా చేసి ఉండొచ్చు. కానీ దాన్ని ప్రత్యేకంగా వీడితీసి ఇన్ స్టాలో పోస్ట్ చేయడం ఏంటి? భర్త అంటే అంత చులకన భావం సోనాక్షిలా ఉందా? అంటూ నెటి జనులు నిప్పులు చెరుగు తున్నారు. అందుకేనా ప్రేమించి పెళ్లి చేసుకున్నావ్? అంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి వీరిద్దరి మతాలు వేరు కావడంతో పెళ్లికి ముందే ట్రోలింగ్ జరిగింది. కానీ పెద్దలు మతాల్ని పక్కనబెట్టి ప్రేమకి విలువనిచ్చి పెళ్లి చేసారు.
ఈ పెళ్లి సోనాక్షి సిన్హా అన్నయ్యలకు ఇష్టం లేనట్లు వెలుగులోకి వచ్చింది. ఆ కారణంగానే పెళ్లికి కూడా హాజరు కాలేదు. జ్వరం కారణంగా శత్రుజ్ఞ సిన్హా ఆసుపత్రిలో చేరితో అక్కడ కూడా సోదరి అన్నయ్య లిద్దరు మాట్లాడలేదని వార్తలొచ్చాయి.