గ్రాండ్ గా ఆ బ్యూటీ ఇంట‌ మెహందీ వేడుక‌!

తాజాగా ఆ వేడుక‌కు సంబంధించి ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి సోనాక్షి సిన్హా త‌న స్నేహితులు, స‌న్నిహితుల‌తో క‌లిసి కొన్ని ఫోటోల‌కు ఫోజులిచ్చారు.

Update: 2024-06-22 08:32 GMT

బాలీవుడ్ న‌టి సోనాక్షి సిన్హా - జ‌హీర్ ఇక్భాల్ వివాహ బంధంతో ఒక‌ట‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప్రీ వెడ్డింగ్ వేడుక‌లు మొద‌లైపోయాయి. దీనిలో భాగంగా గ్రాండ్ గా మెహందీ వేడుక జ‌రిగింది. తాజాగా ఆ వేడుక‌కు సంబంధించి ఫోటోలు కొన్ని నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి సోనాక్షి సిన్హా త‌న స్నేహితులు, స‌న్నిహితుల‌తో క‌లిసి కొన్ని ఫోటోల‌కు ఫోజులిచ్చారు. ఆమె ఎంతో అందంగా ముస్తాబ‌య్యారు.

ఇల్లంతా ఎంతో అందంగా అలంక‌రించారు. పూల తోర‌ణాల‌తో, రంగుల వ‌ల్లీల‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతుంది. వీరిద్ద‌రి వివాహానికి ఇంకా కొన్ని గంట‌లే స‌మ‌య‌మే ఉంది. రేపే వివాహం కావ‌డంతో ప్రీవెడ్డింగ్ పార్టీని అంతా ఆస్వాదిస్తున్నారు. అయితే ఈ వావాహ కార్య‌క్ర‌మం కేవ‌లం కుటుంబ స‌భ్యులు, స‌న్నిహితులు, స్నేహితుల స‌మ‌క్షంలోనే జ‌రుగుతంద‌ని స‌మాచారం. బాలీవుడ్ నుంచి త‌మ‌కు బాగా స‌న్నిహితంగా ఉండే వారు హాజ‌ర‌య్యే అవ‌కాశం ఉంది.

అయితే ఈ వివాహం సోనాక్షి సిన్హా కుటుంబానికి వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే. అందులోనూ తండ్రి శ‌త్రుజ్ఞు సిన్హాకి అస‌లే ఇష్టం లేద‌ని నెట్టింట ప్ర‌చారం సాగింది. ఈవార్త‌ల‌న్నీ శ‌త్రుజ్ఞు సిన్హా ఖండించారు. కూమార్తె వివాహం గురించి ఎంతో సంతోషంగా మాట్లాడారు. `సోనాక్షి అంటే చాలా ఇష్టం. సోనాక్షి నన్ను తన మూలస్తంభంగా భావిస్తుంది. నేను వారి పెళ్లికి తప్పకుండా హాజరవుతాను. నేను ఎందుకు పెళ్లికి హాజరవ్వకూడదు. సోనాక్షి, జహీర్ కలిసి జీవించాలి.

వారి జోడీ చాలా బాగుంది. వారు ఇద్దరూ కలిసి గొప్ప జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నా` అని శతృఘ్న సిన్హా చెప్పుకొచ్చారు. సోష‌ల్ మీడియా క‌థ‌నాల‌పై ఇలా స్పందించారు. ‘కామూష్.. ఇది మీకు సంబంధిం చిన విష‌యం కాదు. మీ పని మాత్రమే చూసుకోండి` అని కాస్త గట్టిగానే హెచ్చరించారు. దీంతో సోష‌ల్ మీడియా క‌థ‌నాల‌న్నీ త‌ప్పు అని తేలిపోయింది.

Tags:    

Similar News