ఆ నవ్వుతోనే మాయ చేస్తోందిగా!
స్రవంతి చొక్కారపు.. ఈ పేరు వింటే ఎవరికైనా రాయలసీమ యాస గుర్తుకు వస్తుంది. అంతలా తన యాసతో ఆకట్టుకుంది.
స్రవంతి చొక్కారపు.. ఈ పేరు వింటే ఎవరికైనా రాయలసీమ యాస గుర్తుకు వస్తుంది. అంతలా తన యాసతో ఆకట్టుకుంది. యూట్యూబ్ ఛానెల్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించిన ఈ తెలుగు పిల్ల.. ఐకాన్ స్టార్ పుష్ప సినిమాలో సూపర్ క్రేజ్ దక్కించుకుంది. యూట్యూబ్ వీడియోలతో ఫేమ్ సాధించి.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ కొట్టేసింది.
అయితే బిగ్ బాస్ షోకు వెళ్లే ముందు వరకు కొద్ది మందికే తెలిసిన భామ.. ఆ తర్వాత సూపర్ పాపులారిటీ దక్కించుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్గా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తనకు పెళ్లయిందని హౌస్ లో చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ గేమ్ లో తనదైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ టాప్ 5 వరకు ఉండలేక పోయింది.
ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ అమ్మడి క్రేజ్ భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను ఆకట్టుకునే పనిలో పడింది. ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఏమాత్రం తరగని అందంతో ప్రేక్షకులను కవ్విస్తుంటుంది.
అందాలు ఆరోబోస్తూ వావ్ అనిపిస్తుంటుంది ఈ వయ్యారి. ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించే స్రవంతి.. అప్పుడప్పుడు కాస్త గ్లామర్ డోస్ పెంచుతూ.. కుర్రకారుకు కిర్రెక్కిస్తుంటోంది. ఇన్స్టాను హీటెక్కిస్తుంటోంది. నవ్వుతోనే కుర్రాళ్లను మైమరిపిస్తుంటోంది. అందాల బాణాలు విసురుతూ అట్రాక్ట్ చేస్తోంది.
తాజాగా ఓ రెస్టారెంట్ లో గ్రీన్ కలర్ పొట్టి డ్రెస్ తో దిగిన ఫొటోలను షేర్ చేసింది. కివీ ఫ్రూట్ సింబల్స్ ను క్యాప్షన్ గా ఇస్తూ పోస్ట్ చేసింది. అందాలన్నీ ప్రదర్శిస్తూ హీట్ పుట్టించింది. కుర్రకారును ఫిదా చేసేసింది. నవ్వుతోనే మాయ చేసింది. దీంతో ఆమె ఫొటోలపై ఫ్యాన్స్ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
స్రవంతి కొత్త ఫొటోలను రీషేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. నవ్వుతోనే మాయ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు.. యాంకర్ గా సత్తా చాటుతోంది. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్కు యాంకర్గా చేస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది.