మహేష్ మాటతో అమ్మడి రేంజ్ ఎక్కడికో..

తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం మూవీ నుంచి రిలీజ్ అయిన 'ఓ మై బేబీ' సాంగ్ ప్రోమో సినిమాలో శ్రీలీలా క్యారెక్టర్ పై మరింత హైప్ క్రియేట్ చేసింది.

Update: 2023-12-12 12:48 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయస్ట్ హీరోయిన్ ఎవరంటే అందరూ చెప్పే పేరు శ్రీలీలా. ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలో ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది ఈ యంగ్ హీరోయిన్. ప్రజెంట్ టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న శ్రీలీల ఈమధ్య రొటీన్ పాత్రలతో ఆడియన్స్ ని నిరాశ పరుస్తూ వస్తోంది. ఇప్పటివరకు శ్రీలీల నటించిన సినిమాలను పరిశీలిస్తే ఒక్క 'భగవంత్ కేసరి' తప్పితే మిగిలిన సినిమాలు అన్నిటిలోనూ గ్లామర్ పాత్రల్లో రొటీన్ గా కనిపించింది.

ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచాయి. శ్రీలీల నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల్లో కేవలం ఓ టెంప్లేట్ క్యారెక్టర్, ఒక డాన్స్ నెంబర్, రెండు ఫారెన్ సాంగ్స్.. అంతే తప్పితే వీటిలో మరేం లేదు. దాంతో శ్రీలీలా క్యారెక్టర్ రొటీన్ అయిపోయిందని ఆడియన్స్ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో గుంటూరు కారం మూవీలో శ్రీలీల కనిపించిన తీరుతో ఆమెకి మరింత మైలేజ్ వచ్చిందని చెప్పొచ్చు.

ఇప్పటివరకు టాలీవుడ్ లో కమర్షియల్ సినిమాల్లో శ్రీలీల పోషించిన పాత్రలతో నిరాశ చెందిన ఫ్యాన్స్ తాజాగా మహేష్ బాబు గుంటూరు కారం మూవీ నుంచి రిలీజ్ అయిన 'ఓ మై బేబీ' సాంగ్ ప్రోమో సినిమాలో శ్రీలీలా క్యారెక్టర్ పై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ ప్రోమోలో మహేష్ బాబు శ్రీలను 'అమ్ము' అని ముద్దుగా పిలిచి తనను తాను 'రావణ' గా పరిచయం చేసుకోవడం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ప్రోమోని బట్టి చూస్తే సినిమాలో శ్రీలీల పాత్రకి ఎంతో ఇంపార్టెన్స్ ఉందని అర్థమైంది.

శ్రీలీల గత సినిమాల్లో చేసిన క్యారెక్టర్స్ కంటే గుంటూరు కారం లో ఆమె క్యారెక్టర్ విభిన్నంగా ఉండబోతుందని చెప్పొచ్చు. ఈ ప్రోమో చూసిన చాలామంది శ్రీలీలకి ఈ మూవీ మంచి మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. శ్రీలీల కూడా తన ఆశలన్నీ మహేష్ సినిమా పైనే పెట్టుకుంది. గుంటూరు కారం తనను టాప్ ప్లేస్ లో ఉంచుతుందని శ్రీలీలా ఆశిస్తోంది.

టాలీవుడ్ లో గతంలో చేసుకుంటే కొంతమంది హీరోయిన్స్ కెరీర్ స్టార్టింగ్ లో ఒకటి రెండు సినిమాలతోనే ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ అందుకుని ఆ తర్వాత సక్సెస్ అవడంలో విఫలమయ్యారు. ఉదాహరణకు తాప్సి, కృతి శెట్టి లాంటి హీరోయిన్స్ గతంలో ఇదే పేస్ చేశారు. దానివల్ల టాలీవుడ్ లో వీళ్ళ కెరియర్ ప్రమాదంలో పడుతుంది. ఇప్పుడు శ్రీలీల కూడా అదే స్టేజ్ లో ఉంది మరి. గుంటూరు కారంతో ఈ యంగ్ బ్యూటీ ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News