వందేళ్ల చరిత్రని తిరగరాసిన బన్నీ… సలాం కొట్టిన బాలీవుడ్

100 ఏళ్ళ బాలీవుడ్ సినిమా చరిత్రలో ఒక టాలీవుడ్ హీరో కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ గా నిలిచాడు.

Update: 2024-12-20 17:25 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2'తో చరిత్ర సృష్టించాడు. ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలో ఇప్పటి వరకు ఎవ్వరికి సాధ్యం కానీ హైట్స్ ని ఈ చిత్రంతో అందుకున్నాడు. ముఖ్యంగా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ పరిశ్రమ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో వేల సినిమాలు వచ్చాయి. అక్కడ ఖాన్ త్రయానికి దేశంలోనే అత్యధిక క్రేజ్ ఉంది.

 

అలాగే ఇండియాలోనే అత్యధిక బ్రాండ్ వేల్యూ ఉన్న స్టార్స్ కూడా బాలీవుడ్ లోనే ఉన్నారు. అలాంటి బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్స్ కి సాధ్యం కానీ కలెక్షన్స్ ని 'పుష్ప 2'తో అందుకొని తనకి తిరుగులేదని నిరూపించుకున్నాడు. కేవలం 15 రోజుల్లోనే 632.50 కోట్లు కలెక్షన్స్ ని హిందీలో వసూళ్లు చేయడం ద్వారా బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్స్ సొంతం చేసుకున్న చిత్రంగా రికార్డ్ సృష్టించింది.

100 ఏళ్ళ బాలీవుడ్ సినిమా చరిత్రలో ఒక టాలీవుడ్ హీరో కలెక్షన్స్ పరంగా నెంబర్ వన్ గా నిలిచాడు. మొన్నటి వరకు 'స్త్రీ 2' మూవీ 627 కోట్లతో టాప్ లో ఉండేది దీనిని కేవలం 15 రోజుల్లోనే 'పుష్ప 2' బ్రేక్ చేసి టాప్ చైర్ లోకి వెళ్ళింది. అలాగే కేవలం 14 రోజుల్లోనే 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా ఈ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

అలాగే ఒక్క ముంబైలోనే 200 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించిన మొట్టమొదటి సినిమాగా మరో ఫీట్ అందుకుంది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల జాబితాలో 'కల్కి'ని బీట్ చేసి టాప్ లోకి ఈ చిత్రం వచ్చింది. అల్లు అర్జున్ మాసివ్ పెర్ఫార్మెన్స్, సుకుమార్ క్రియేటివ్ రైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కి ఆడియన్స్ విపరీతంగా కనెక్ట్ అయ్యారు.

ప్రమోషన్స్ క్యాంపైన్స్ కూడా ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యిందని చెప్పాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అతి పెద్ద హిట్ మూవీగా 'పుష్ప 2' నిలిచింది. మరల మైత్రీ టీమ్ 'పుష్ప 2' రికార్డ్ ని ఇప్పట్లో బ్రేక్ చేయలేకపోవచ్చని అనుకుంటున్నారు. ఓవరాల్ గా ఒక తెలుగు సినిమా బాలీవుడ గడ్డపై సత్తా చాటింది. బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్స్ సైతం పుష్ప రాజ్ క్రేజ్ కు సలాం కొట్టారు. ఇదే ఊపుతో భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడం గ్యారెంటీ అని అనుకుంటున్నారు.

Tags:    

Similar News