కాంచన-4.. ఆమెకు గోల్డెన్ ఛాన్స్
ఇప్పుడు పూజానే హీరోయిన్ గా మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
కాంచన సిరీస్ చిత్రాలు.. హార్రర్ కామెడీ నేపథ్యంతో రూపొంది ఎలాంటి హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. కాంచన ఫ్రాంచైజీలో ఇప్పటి వరకు మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. అన్నీ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. ఓ రేంజ్ లో మెప్పించాయి. హారర్ థ్రిల్ ను కూడా కలిగించాయి.
అయితే హార్రర్ కామెడీ జోనర్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన రాఘవ లారెన్స్.. మూడు భాగాలకు కూడా దర్శకత్వం వహిస్తూ లీడ్ రోల్ లో నటించారు. ఇప్పుడు కొద్ది రోజుల క్రితం కాంచన సిరీస్ లో నాలుగో మూవీని కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సారి లారెన్స్.. నటిస్తూ దర్శకత్వం చేయడమే కాదు.. నిర్మాతగా కూడా వ్యవహరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
2024 సెప్టెంబర్ లో కాంచన-4 షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. కానీ ఇంకా మొదలు కాలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్యాస్టింగ్ ను ఫిక్స్ చేస్తున్నారట మేకర్స్. షూటింగ్ మొదలు పెట్టేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
పొంగల్ తర్వాత షూటింగ్ మొదలుకానున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. అయితే కాంచన-4లో హీరోయిన్ గా పూజా హెగ్డేను సెలెక్ట్ చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపించింది. సినిమాల విషయంలో ఎంతో సెలెక్టివ్ గా ఉండే మృణాల్.. మంచి ఛాన్స్ అందుకుందని అనుకున్నారు.
ఇప్పుడు పూజానే హీరోయిన్ గా మేకర్స్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారట. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న పూజా.. సూపర్ ఛాన్స్ అందుకున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇక పూజా సినిమాల విషయానికొస్తే.. విజయ్ దళపతి 69లో హీరోయిన్ గా నటిస్తున్నారు. దళపతి కెరీర్ లో చివరి సినిమా అదే. సూర్య 44లో ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ షూటింగ్ పూర్తి అయింది. వాటితోపాటు మరిన్ని సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు కాంచన-4లో నటించే ఛాన్స్ అందుకున్నారు! మరి పూజా తన అప్ కమింగ్ చిత్రాలతో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.