సుధీర్ బాబు హరోం హర.. వచ్చేది ఎప్పుడంటే..

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు జూన్ 14కి ఈ మూవీ రిలీజ్ వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.

Update: 2024-05-21 06:45 GMT

టాలెంటెడ్ యాక్టర్ సుధీర్ బాబు ఈ సారి యాక్షన్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. హరోం హర టైటిల్ తో తెరకెక్కిన ఈ హై వోల్టేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ మూవీ గంగాసాగర్ ద్వారక దర్శకత్వంలో సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ హరోం హర సినిమాలో ఉన్నాయని టీజర్ బట్టి అర్ధమవుతోంది.

 

సుధీర్ బాబు తెలుగులో సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అలాగే మాస్ ఆడియన్స్ కి చేరువ కావడానికి మాస్ యాక్షన్ కథని ఎంపిక చేసుకొని చేస్తున్నాడు. సెహరి మూవీతో దర్శకుడిగా కెరియర్ మొదలుపెట్టిన గంగాసాగర్ రెండో సినిమాని రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తిగా కుప్పం నేపథ్యంలో కథ రాసుకొని చేస్తున్నాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ కథలకి, అందులో ఉండే యాక్షన్ కి తెలుగునాట మంచి క్రేజ్ ఉంది.

అయితే ఈ సారి ప్యూర్ ఫ్యాక్షన్ కాకుండా రౌడీయిజం తరహాలో హరోంహర సినిమా కథని చెప్పబోతున్నాడు. అలాగే అందమైన లవ్ స్టోరీ కూడా ఈ మూవీ ఉన్నట్లు తెలుస్తోంది. మాళవిక శర్మ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యిందనే మాట వినిపిస్తోంది. ఆమె హరోంహర సినిమాతో టాలీవుడ్ లో సారి అదృష్టం పరీక్షించుకుంటుంది.

సునీల్ మూవీలో ఓ కీలక పాత్రలో నటిన్నాడు. కుప్పం సరిహద్దులో అంటే తెలుగుతో పాటు, తమిళ్ ఆడియన్స్ కి కూడా ఈ మూవీ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని మే 31న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు జూన్ 14కి ఈ మూవీ రిలీజ్ వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసింది.

పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతోనే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారు. సినిమాలో క్యారెక్టరైజేషన్ కోసం ఎంతైన కష్టపడే వ్యక్తిత్వం సుధీర్ బాబుకి ఉంది. అలాగే కొత్త కంటెంట్ లు ప్రేక్షకులకి అందించాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ సినిమాలు తాను ఎక్స్ పెక్ట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ వస్తుందనే నమ్మకంతో సుధీర్ బాబు ఉన్నారు. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే సాంగ్ కూడా రిలీజ్ అయ్యి ఆకట్టుకుంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News