పుష్ప 2 డీల్.. ఆ లాభమంతా సుక్కుదేనా?

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా వంద కోట్లకి కొనుగోలు చేసినట్లు టాక్. ఇక ఆ మొత్తం అంతా కూడా సుకుమార్ రెమ్యునరేషన్ గా అందుకోబోతున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

Update: 2023-11-26 16:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ పుష్ప 1. ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాని సుకుమార్ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

దేశ వ్యాప్తంగా పుష్ప 2పైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. వాటిని అందుకోవడం కోసం సుకుమార్ అండ్ కో గట్టిగానే కష్టపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా దర్శకుడు సుకుమార్ కి భారీగా రెమ్యునరేషన్ క్రింద గిట్టుబాటు అవుతోంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకుడిగా రాజమౌళి మాత్రమే ఉన్నారు. ఆయన లెక్క కలెక్షన్స్ లో ప్రాఫిట్ ను బట్టి ఉంటుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇప్పుడు సుకుమార్ కూడా రాజమౌళి సరసన చేరారు. పుష్ప సినిమా డిజిటల్ రైట్స్ ని మైత్రీ మూవీ మేకర్స్ వారు సుకుమార్ కి లాభాల్లో వాటాగా ఇచ్చేసారంట.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా వంద కోట్లకి కొనుగోలు చేసినట్లు టాక్. ఇక ఆ మొత్తం అంతా కూడా సుకుమార్ రెమ్యునరేషన్ గా అందుకోబోతున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. నెట్ ఫ్లిక్స్ ఇచ్చే వంద కోట్ల చెక్ నేరుగా సుకుమార్ కె దక్కుతోంది. బిజినెస్ ఒప్పందంలో భాగంగా ఈ డీల్ జరగడంతో సుకుమార్ కి ఇలా కలిసొచ్చింది. దీంతో పుష్ప 2 సినిమాకి గాను ఏకంగా వంద కోట్ల రెమ్యునరేషన్ ని సుకుమార్ అందుకున్తున్నట్లు అయ్యింది.

ఇది నిజంగా రికార్డ్ అని చెప్పాలి. రాజమౌళి రెమ్యునరేషన్ లాభాల్లో వాటా వంద కోట్లకు పైగానే అనే టాక్ ఉంది. ఇక సినిమా లాభాల్లో వాటా క్రింద సుకుమార్ కూడా వంద కోట్ల రెమ్యునరేషన్ ని అందుకున్నాడు. ఈ విధంగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న దర్శకులలో సుకుమార్ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు.

Tags:    

Similar News