ధమాకా డైరెక్టర్ తో సందీప్ మూవీ.. బిజినెస్ గట్టిగానే..
కొన్నాళ్లుగా తెలుగు చిత్రాల్లో యాక్ట్ చేస్తూనే.. మిగతా లాంగ్వేజ్ మూవీల్లో కూడా నటిస్తున్నారు. తన యాక్టింగ్ తో సినీ ప్రియులను మెప్పిస్తున్నారు.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి టాలెంట్ ఉన్న హీరోల లిస్ట్ లో సందీప్ కిషన్ కచ్చితంగా ఉంటారు. ప్రస్థానం మూవీతో చిత్రసీమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. స్నేహగీతం సినిమాతో హీరోగా మారారు. రొటీన్ లవ్ స్టోరీ మూవీతో సోలో కథానాయకుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. కొన్నాళ్లుగా తెలుగు చిత్రాల్లో యాక్ట్ చేస్తూనే.. మిగతా లాంగ్వేజ్ మూవీల్లో కూడా నటిస్తున్నారు. తన యాక్టింగ్ తో సినీ ప్రియులను మెప్పిస్తున్నారు.
2024లో ఇప్పటికే మూడు సినిమాలతో పలకరించారు సందీప్ కిషన్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చిత్రాలు మిల్లర్, రాయన్ లో నటించి మెప్పించారు. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఊరు పేరు భైరవకోన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ మూవీతో భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ నక్కిన త్రినాథరావుతో వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా(SK 30) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే ఆడియన్స్ లో భారీగా అంచనాలు నెలకొల్పిన ఆ మూవీ.. నాన్ థియేట్రికల్ బిజినెస్ రీసెంట్ గా జరిగినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. భారీ ధరకు మేకర్స్.. అమ్మినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.23 కోట్లకు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
శాటిలైట్, డిజిటల్ హక్కులను రూ.15 కోట్లకు మేకర్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఆడియో హక్కులు రెండున్నర కోట్లకు అమ్మినట్లు సమాచారం. హిందీ రైట్స్ 4.5 కోట్లకు అమ్ముడయ్యాయని టాక్ వినిపిస్తోంది. అలా సందీప్ కిషన్, త్రినాధరావు నక్కిన సినిమా.. నాన్ థియేట్రికల్ కేటగిరీలో సాలిడ్ బిజినెస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. గట్టి బిజినెస్సే జరిగిందిగా అని నెటిజన్లు, సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే.. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. సినిమాకు గాను ఆయన రూ.30 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు కొద్ది రోజులుగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అదే సమయంలో సందీప్ రూ.6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా సందీప్ కిషన్, త్రినాధ రావు నక్కిన మూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుందో లేదో? ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో వేచి చూడాలి.