రిపోర్టర్‌పై రజనీకాంత్‌ కోపం..!

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల కూలీ సినిమా షూటింగ్‌ కోసం థాయిలాండ్ వెళ్లారు.

Update: 2025-01-07 11:11 GMT

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల కూలీ సినిమా షూటింగ్‌ కోసం థాయిలాండ్ వెళ్లారు. దాదాపు రెండు వారాల షూటింగ్‌ నిమిత్తం ఇటీవలే థాయిలాండ్ వెళ్లిన రజనీకాంత్‌ షూటింగ్‌ను మొదలు పెట్టారు. లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ తాజా షెడ్యూల్‌తో దాదాపుగా పూర్తి అవుతుందని సమాచారం అందుతోంది. అతి త్వరలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలను మొదలు పెట్టి, ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు పలువురు స్టార్స్ నటిస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా కూలీ సినిమా షూటింగ్‌ కోసం థాయిలాండ్‌ వెళ్లిన రజనీకాంత్‌ చెన్నై ఎయిర్‌ పోర్ట్‌లో కొంత సమయం రిపోర్టర్స్‌తో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన విషయాలను అడిగిన సమయంలో రజనీకాంత్‌ వాటికి సమాధానం చెప్పారు. కానీ ఎప్పుడైతే ఒక రిపోర్టర్‌ రాష్ట్రంలో విలేకరుల భద్రత గురించి మీ అభిప్రాయం ఏంటి అంటూ ప్రశ్నించాడో అప్పుడు వెంటనే రజనీకాంత్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమయం సందర్భం ఉండదా అంటూ ఆ రిపోర్టర్‌పై అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ఇలాంటి సమయంలో అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారు అంటూ అక్కడ నుంచి రజనీకాంత్‌ వెళ్లి పోవడం జరిగింది.

చెన్నైలోని అన్నా యూనివర్శిటీలో బాలికపై దుండగులు లైంగిక వేదింపులకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అధికార పార్టీకి చెందిన నాయకులు ఆ ఘటన వెనుక ఉన్నారు అంటూ కొందరు విపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంతో మంది ప్రముఖులు ఆ ఘటన గురించి స్పందించారు. అందుకే రజనీకాంత్‌ను రిపోర్టర్ ఆ ఘటనపై స్పందించాల్సిందిగా మహిళల భద్రత గురించి కామెంట్స్ ఏంటి అంటూ ప్రశ్నించాడు. కానీ రజనీకాంత్‌ ఆ సమయంలో విదేశాలకు వెళ్లే హడావిడితో ఉన్నారు. అంతే కాకుండా ఆయన సినిమాలకు సంబంధించిన విషయాలను మాట్లాడేందుకు మీడియా ముందుకు వచ్చారు.

సినిమా గురించి మాట్లాడుతున్న ఈ సమయంలో ఆ విషయంలు ఎందుకు అనే ఉద్దేశ్యంతో రజనీకాంత్‌ అసహనంను రిపోర్టర్‌ పై కనబర్చారు అనేది కొందరి అభిప్రాయం. రజనీకాంత్‌ ఇటీవల వచ్చిన వేట్టయాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో తదుపరి సినిమా అయిన కూలీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ రూపొందిస్తున్నాడు. అతి త్వరలోనే సినిమా విడుదల తేదీ విషయంలో మరింత స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Tags:    

Similar News