స్టార్ హీరో ప్యాన్స్ అప్ప‌టి వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే!

ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్ట‌ర్ లో సూర్య మ‌రోసారి మాస్ లుక్ ఆక‌ట్టుకుంటున్నాడు. 'స‌లార్' లో ప్ర‌భాస్ రేంజ్ లో సూర్య లుక్ హైలైట్ అవుతుంది.

Update: 2025-01-08 21:30 GMT

సూర్య క‌థానాయ‌కుడిగా కార్తీక్ సుబ్బ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో 'రెట్రో' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఇటీవ‌లే రిలీజ్ అయిన టీజ‌ర్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సూర్య మార్క్ యాక్ష‌న్ తో టీజ‌ర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. సూర్య మాస్ లుక్ తో మ‌రోసారి క‌నెక్ట్ అయ్యాడు. హీరో పాత్ర‌ను మ‌రింత వైల్డ్ గా హైలైట్ చేస్తున్నారు. ప్రేమ‌కోసం హింస‌ను వ‌దిలేసే సూర్య‌ని చూపిం చారు.

 

దీంతో ట్రైల‌ర్ ఇంకే రేంజ్ లో ఉంటుంది? అన్న బజ్ క్రియేట్ అవుతుంది. సూర్యకి మ‌రో మాస్ హిట్ ప‌డేలా ఉంది. అయితే రిలీజ్ తేదీపై మాత్రం ఇంత వ‌ర‌కూ క్లారిటీ ఇవ్వ‌లేదు. టీజ‌ర్ రిలీజ్ స‌మ‌యంలోనే తేదీ రివీల్ చేయ‌లేదు. దీంతో సినిమా ఆల‌స్యానికి గ‌ల కార‌ణాల‌పై ర‌క‌ర‌కాల విశ్లేష‌ణ‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో కొద్ది సేప‌టి క్రిత‌మే అన్ని సందేహాల‌కు మేక‌ర్స్ క్లారిటీ ఇచ్చేసారు. 'రెట్రో' చిత్రాన్ని మే 1న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన కొత్త పోస్ట‌ర్ లో సూర్య మ‌రోసారి మాస్ లుక్ ఆక‌ట్టుకుంటున్నాడు. 'స‌లార్' లో ప్ర‌భాస్ రేంజ్ లో సూర్య లుక్ హైలైట్ అవుతుంది. చేతిలో బ‌ల‌మైన ఐర‌న్ రాడ్డు ప‌ట్టుకుని సీరియ‌స్ గా చూస్తున్న పోస్ట‌ర్ ఇంట్రెస్టింగ్. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అయితే ఈ సినిమా మే వ‌ర‌కూ ఎందుకు వెళ్తుంది? అన్న‌ది క్లారిటీ లేదు.

సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ఆల‌స్య‌మ‌వుతుందా? లేక స‌మ్మ‌ర్ రిలీజ్ లు ఎక్కువ‌గా ఉండ‌టంతో? డిలే చేసారా? అన్న‌ది తెలియాలి. ఏది ఏమైనా మేలో మాత్రం ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డం ఖాయం. ప్ర‌స్తుతం సూర్య హీరోగా ఆర్జే బాలాజీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News