షాకిచ్చిన సూర్య‌...ఆ క్యాచ్ ఎనిమిదేళ్ల క్రిత‌మే!

సూర్య కుమార్ యాద‌వ్ అద్భుత‌ క్యాచ్ తో వ‌ర‌ల్డ్ కప్ ఇండియా వ‌స‌మైంది. భార‌త్ మ‌రోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ని ముద్దాడింది

Update: 2024-07-09 15:30 GMT

సూర్య కుమార్ యాద‌వ్ అద్భుత‌ క్యాచ్ తో వ‌ర‌ల్డ్ కప్ ఇండియా వ‌స‌మైంది. భార‌త్ మ‌రోసారి వ‌ర‌ల్డ్ క‌ప్ ని ముద్దాడింది. ఈ క‌ప్ మ్యాచ్ సూర్య కెరీర్ లోనే కాదు భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో చిర స్థాయిగా నిలిచిపోతుంది. కానీ డెవిడ్ మిల్ల‌ర్ క్యాచ్ త‌న జీవితంలో ముఖ్య‌మైంది కాదని షాక్ ఇచ్చాడు. సూర్య నుంచి ఇది ఏమాత్రం రాద‌నుకున్న స‌మాధానం. అభిమానించే క్రికెట్ జీవితాన్ని మించి ఇంకేముంటుంది? అనుకోవ‌డం స‌హ‌జం.

కానీ సూర్య‌కి ఆ క్యాచ్ కంటే ఎనిమిదేళ్ల క్రిత‌మే అంత‌క‌న్నా గొప్ప క్యాచ్ ప‌ట్టాన‌న్నాడు. ఇదేంటి అంత‌క‌న్నా గొప్ప క్యాచ్ ఏంటి? రంజీల్లోనో..టెస్ట్ ల్లోనే..క్రికెట‌ర్ గా ఎదిగే స‌మ‌యంలో ఇంకేదైనా క్యాచ్ ప‌ట్టాడనుకోకండి. ఈ క్యాచ్ అత‌డి వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించింది. ఇటీవ‌లే సూర్య‌కుమార్- దేవిశా శెట్టి దంప‌తుల ఎనిమిద‌వ వార్షికోత్స‌వం జ‌రిగింది. దీనికి సంబంధించి ఓ పెద్ద కేక్ క‌ట్ చేసి అందుకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసారు.

వాటిని ఉద్దేశించి సూర్య ఇలా రాసాడు. `ఆ క్యాచ్ ప‌ట్టి నిన్న‌టికి ఎనిమిది రోజులు అయింది. కానీ నాలైఫ్ లో ముఖ్య‌మైన క్యాచ్ అందుకుని ఎనిమిది సంవ‌త్స‌రాలు అవుతుంది` అనే క్యాప్ష‌న్ జోడించాడు. అంటే జీవితంలో అత‌డి ఎదుగుద‌ల‌లో త‌న భార్య కూడా ఉంద‌ని ఈ ర‌కంగా సూర్య చెప్పే ప్ర‌య‌త్నం చేసాడు. వీరి వివాహం జూలై 7 ..2016 లో జ‌రిగింది. 2010 లో ఓ కాలేజీ వేడుక‌లో ఇద్ద‌రి ప‌రిచ‌యం జ‌రిగింది. అది ప్రేమ‌గా విక‌సించింది.

అటుపై పెద్ద‌ల్ని ఒప్పించి వివాహ బంధంతో ఒక‌ట‌య్యారు. సూర్య కుమార్ టీమ్ ఇండియాలోకి ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఎంట్రీ ఇచ్చాడు. ఆరంభంలో చివ‌రిలో బ్యాటింగ్ ఇచ్చేవారు. అదే అవ‌కాశంగా భావించి బ్యాట్ తో స‌త్తా చాటాడు. ఉన్న బంతుల్లోనే మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌తో గొప్ప బ్యాట్స్ మెన్ గా ఎదిగాడు. నేడు వ‌ర‌ల్డ్ క‌ప్ ని ఇండియాకి తేడంలో కీల‌క పాత్ర పోషించాడు. జ‌ట్టులో అత‌డికి ఇంకా గొప్ప స్థానం ఖాయ‌మ‌ని చెప్పొచ్చు.

Tags:    

Similar News