తాప్సీ పెళ్లి మాత్ర‌మేనా? నిశ్చితార్థం ర‌హ‌స్యంగానే!

తాప్సీ తాజాగా 'రిలేషన్‌షిప్ టి అడ్వైస్' షోలో కనిపించిన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించింది.

Update: 2024-08-11 14:30 GMT

తాప్సీ పన్ను ర‌హ‌స్య వివాహం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. గుట్టు చ‌ప్పుడు కాకుండా పెళ్లాడి, ఇదిగో పెళ్లాడేశాను! అంటూ తాప్సీ ఒక వీడియోని రిలీజ్ చేసింది. అయితే కేవ‌లం పెళ్లి మాత్ర‌మే కాదు.. తాప్సీ నిశ్చితార్థం కూడా ఒక ర‌హ‌స్యం అన్న సంగ‌తి ఇప్పుడు బ‌య‌ట‌ప‌డింది. ఈ బ్ర‌హ్మాండ‌లంలో ఎవ‌రికీ తెలియ‌కుండా ర‌హ‌స్యంగా తొమ్మిదేళ్ల క్రిత‌మే తాప్సీ నిశ్చితార్థం చేసుకుంది. అయినా ఎవ‌రూ క‌నిపెట్ట‌లేక‌పోయారు! చివ‌రికి మీడియా కూడా ఫెయిలైంది!! డీప్‌గా వివ‌రాల్లోకి వెళితే...

బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు, కోచ్ మథియాస్ బోతో పెళ్లికి ముందు 9 సంవత్సరాల క్రిత‌మే తాప్సీ నిశ్చితార్థం చేసుకుంది. డెస్టినేషన్ వెడ్డింగ్‌లు - గ్రాండ్ సెలబ్రేషన్స్‌ యుగంలో తాప్సీ పన్ను డానిష్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోతో వివాహం ఒక ప్రైవేట్ వ్యవహారంగా ఉండిపోయింది. 11 సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత, తాప్సీ -మథియాస్ మార్చి 23న సన్నిహితుల స‌మ‌క్షంలో సింపుల్ గా వివాహం చేసుకున్నారు.

ఇదంతా తెలిసిన విష‌య‌మే అయినా..ఈ జంట గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని విష‌యాలు చాలా ఉన్నాయి. ఈ అంద‌మైన పెయిర్ పెళ్లికి తొమ్మిదేళ్ల ముందు నిశ్చితార్థం చేసుకున్నారనేది ఎవ‌రికీ తెలియ‌నే తెలీదు. తాప్సీ తాజాగా 'రిలేషన్‌షిప్ టి అడ్వైస్' షోలో కనిపించిన సమయంలో ఈ విషయాన్ని వెల్లడించింది. మేము (తాప్సీ మరియు మథియాస్) సుమారు 10-11 సంవత్సరాల క్రితం కలుసుకున్నాం. కలిసిన ఒక సంవత్సరం తర్వాత అతడు నాకు ప్రపోజ్ చేశాడు. కాబట్టి తొమ్మిదేళ్ల క్రితం నిశ్చితార్థం అయింది. కానీ మా ఇద్ద‌రిలో ఎవరూ మా మనసును మార్చుకోలేదు. మేం ఇంకా కలిసి ఉండగలమని నమ్ముతున్నాము.. జీవితంలో చాలా భాగం కలిసే ఉంటాం'' అని ప్రాక్టిక‌ల్‌గా మాట్లాడింది.

అదే ఇంటర్వ్యూలో తాప్సీ- మథియాస్ బో దుబాయ్‌లో తమ మొదటి డేట్ ను ప్లాన్ చేసినప్పుడు మరపురాని క్షణాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. ''అతడు నాకు ప్రపోజ్ చేసాడు.. నేను మిమ్మల్ని డెన్మార్క్ లేదా దుబాయ్‌లో డేట్‌కి తీసుకెళ్లాలనుకుంటున్నాను.. ఎందుకంటే ఈ రెండు ప్రదేశాలు నాకు బాగా తెలిసిన విషయాలు ఉన్నాయి'' అని అన్నాడు. డెన్మార్క్‌కు వెళ్ల‌గ‌ల‌మా? ఇది చాలా కష్టం కాబట్టి మేం దుబాయ్‌ని ఎంచుకున్నాం.. అని తాప్సీ తెలిపింది.

అత‌డు ప్ర‌పోజ్ చేయ‌గానే నాలో చాలా సందేహాలు. ''ఈ వ్యక్తి నాపై ఎందుకు ఇంత‌గా ఆసక్తిని కలిగి ఉన్నాడు? ప్రపంచంలోని డౌట్లు అన్నీ నాలోనే ఉన్నాయి. మనకు తెల్లవారితే ఏం జ‌రుగుతుందోన‌నే భావన ఉంది. మనందరికీ న్యూనత కాంప్లెక్స్ ఉంది. కాబట్టి నేను అలానే ఉన్నాను.. కానీ నాకేం? నేను అతడిని కలవడానికి సిద్ధంగా ఉన్నాను'' అని కూడా తాప్సీ చెప్పింది.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. తాప్సీ పన్ను న‌టించిన తాజా చిత్రం 'ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా' ఆగస్టు 9న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌లైంది. ఈ చిత్రం 2021లో వచ్చిన థ్రిల్లర్ 'హసీన్ దిల్‌రూబా'కు సీక్వెల్. జయప్రద్ దేశాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రాంత్ మాస్సే, సన్నీ కౌశల్ కీలక పాత్రల్లో నటించారు.

Tags:    

Similar News