తాప్సీని 'జీరో సైజ్' కిల్ చేసిందా?

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Update: 2024-08-14 03:31 GMT

తాప్సీ పన్ను అన‌గానే ఒక‌ప్ప‌టి బొద్దంద‌మే ఇంకా తెలుగు ఆడియెన్‌కి గుర్తుంది. ఝుమ్మందినాదం సినిమాతో మంచు మ‌నోజ్ స‌ర‌స‌న తాప్సీ టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైంది. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మోడ‌ల్ గా కెరీర్ ప్రారంభించి సినీరంగంలో ప్ర‌వేశించిన‌ప్పటికి తాప్సీ ఛామింగ్ లుక్స్, రింగుల జుత్తు.. చిల్లు బుగ్గ‌ల‌కు ఫిదా అవ్వ‌ని ఆడియెన్ లేడు. ఈ బ్యూటీ ఎంతో హెల్ధీ కంటెంట్ తో నేచుర‌ల్‌గా క‌నిపించేది. తెలుగు సినీరంగంలో చాలా కాలం అలానే క‌నిపించింది.


కానీ ఆ త‌ర్వాత కాల‌క్ర‌మేణా తాప్సీలో మార్పు మొద‌లైంది. దీనికి కార‌ణం బాలీవుడ్. హిందీ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టిన త‌ర్వాత తాప్సీ పూర్తిగా సైజ్ జీరో కోసం పాకులాడింది. త‌ప‌న‌కు త‌గ్గ‌ట్టే త‌న శ‌రీరాన్ని బక్క‌చిక్కిన స్థాయికి తీసుకువ‌చ్చింది. ఇప్ప‌టికీ తాప్సీలో సైజ్ జీరో ఫీవ‌ర్ త‌గ్గ‌డం లేద‌ని ఇటీవ‌లి వ‌రుస ఫోటోషూట్లు చెబుతున్నాయి. క్రీడాకారుడు కం కోచ్ మాథియాస్ బోని పెళ్లాడిన తాప్సీ పెళ్లి త‌ర్వాతా సినీకెరీర్ ని ముందుకు సాగిస్తోంది. బ‌హుశా త‌న శ‌రీరాన్ని పూర్తిగా క‌ష్ట‌పెట్ట‌డానికి కార‌ణం ఇదే కావొచ్చని విశ్లేషించారు.


ఇటీవ‌ల పోటీ యుగంలో నిరంత‌ర ఫోటోషూట్ల‌తో తాప్సీ యూత్‌లో హాట్ టాపిక్ గా మారుతోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ చ‌ర్చ‌గా మారింది. ఫోటోషూట్ లో తాప్సీ శ‌రీరాకృతి పూర్తిగా పీల‌గా క‌నిపిస్తోంది. సైజ్ ఫీవ‌ర్‌తో జీరో నుంచి మైన‌స్‌లోకి తాప్సీ వెళ్లిపోయిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎంపిక చేసుకున్న థై హై మిడీ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. తాప్సీ న‌వ్వు బావుంది. కానీ త‌న రూపమే బాగా పీల‌గా క‌నిపిస్తోంద‌ని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జీరో సైజ్.. మైన‌స్ సైజ్ కోసం తాప్సీ పూర్తిగా డైట్ పాటిస్తోంద‌ని, న‌చ్చిన ఆహారాలేవీ తిన‌డం లేద‌ని ఫ్యాన్స్ ఆందోళ‌న చెందుతున్నారు. హ‌ద్దు మీరి ఫిట్ నెస్ కోసం త‌పించ‌డం కూడా ఒక్కోసారి ప్రాబ్ల‌మే. వీట‌న్నిటికీ చెక్ పెట్టేలా తాప్సీ నెక్ట్స్ ప్ర‌ణాళిక ఏమిటో వేచి చూడాలి.


Tags:    

Similar News