20 ఏళ్లు అయినా అదే అందం..!

సోషల్‌ మీడియాలో ఈమె అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

Update: 2024-10-06 03:42 GMT

మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్‌ లో శ్రీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి దాదాపుగా 20 ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు అంటూ తాజా ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది. మొదటి సినిమా తో పోల్చితే ఇప్పుడు అంతకు మించి అందంగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఈమె అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా ఎక్కువ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.


బాహుబలి తర్వాత తమన్నా పనైపోయిందని అనుకుంటున్న సమయంలో ఎప్పటికప్పుడు తన క్రేజ్ ను, తన స్టార్‌డంను నిరూపించుకుంటూ వరుసగా సినిమాల్లో నటిస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు స్త్రీ 2, వేద సినిమాల్లో నటించడం ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ రెండు సినిమాల్లోనూ స్పెషల్‌ అప్పియరెన్స్‌ అయినప్పటికీ ఆ సినిమాల క్రెడిట్‌ ఈమె స్థాయిని మరింతగా పెంచాయి అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. తాజాగా ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఫోటోలు చూసి చాలా మంది ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


ఇండస్ట్రీలో అడుగు పెట్టి 20 ఏళ్లు కావస్తోంది, నాలుగు పదుల వయసుకు చేరువ అయినా ఇంతటి అందం ఏంట్రా బాబు అంటూ ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. స్టార్‌ హీరోలకు ఇప్పటికీ సరి జోడీ అన్నట్లుగా అందంగా ఉన్న తమన్నా ను స్టార్‌ హీరోలు ఎక్కువగా పరిగణలోకి తీసుకోకున్నా ఎప్పుడు బిజీగానే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈమె తెలుగు లో కంటే ఎక్కువ ఇతర భాషల్లో కనిపిస్తూ ఉంది. హీరోయిన్‌ గానే కాకుండా ఇతర ముఖ్య పాత్రల్లో, ఐటెం సాంగ్స్ లో నటించడం ద్వారా ఈ అమ్మడు రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంది. ఇప్పుడు అందమైన ఫోటోలతో వైరల్‌ అవుతోంది.


మిల్కీ బ్యూటీ తమన్నా మెరుపుల డ్రెస్ లో మెరుపులు మెరిపిస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. క్లీ వేజ్ షో తో అదరగొట్టిన ఈ అమ్మడు పాతికేళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. నెట్టింట ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న ఫోటోలు, వీడియోలు మరోసారి ఆమె స్థాయిని పెంచాయి అనడంలో సందేహం లేదు. టాలీవుడ్‌ లో సుదీర్ఘ ఇన్నింగ్స్ తో సినిమాలు చేసిన హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్‌ లో పెద్ద సినిమాలు చేయడం లేదు, కానీ భవిష్యత్తులో వరుసగా సినిమాలు చేస్తుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్‌. మరి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా తమన్నా మళ్లీ బిజీ అయ్యేనా చూడాలి.

Tags:    

Similar News