తారక్, జాన్వి.. మర్చిపోలేని బీచ్ సాంగ్..!
ఈమధ్యనే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన యూనిట్ అక్కడ మెయిన్ లీడ్స్ మధ్య ఒక ఫీల్ గుడ్ లవ్ సాంగ్ షూట్ చేశారని తెలుస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లో సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తారక్ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ఈమధ్యనే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చిన యూనిట్ అక్కడ మెయిన్ లీడ్స్ మధ్య ఒక ఫీల్ గుడ్ లవ్ సాంగ్ షూట్ చేశారని తెలుస్తుంది.
అనిరుద్ మాస్ మ్యూజిక్ లోనే కాదు మెలోడీస్ లో కూడా అదరగొట్టేస్తాడు. దేవర సినిమాలో ఎన్.టి.ఆర్, జాన్వి ల మధ్య ఒక మంచి బీచ్ సాంగ్ అది కూడా లవ్ అండ్ రొమాంటిక్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సాంగ్ లో జాన్వి గ్లామర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అంటున్నారు. ఎన్.టి.ఆర్, జాన్వి జోడీనే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండబోతుంది. అనిరుద్ తన మ్యూజిక్ తో సినిమాకు మరింత కలర్ అద్దుతున్నాడు.
దేవర లో ఈ స్పెషల్ సాంగ్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు. RRR తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. దేవర సినిమాను కొరటాల శివ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెరకెక్కిస్తున్నారు. దేవర 1 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ లో వస్తుండగా దేవర 2 కి మరో ఏడాది టైం తీసుకుంటారని తెలుస్తుంది.
దేవర సినిమా కోసం ఫ్యాన్స్ అంతా కూడా ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆచార్యతో డిజాస్టర్ ఫేస్ చేసిన కొరటాల శివ దేవరతో తన సత్తా ప్రూవ్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ తారక్ తో జనతా గ్యారేజ్ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న కొరటాల శివ అంతకుముందు బృందావనం సినిమాకు కథ కూడా అందించారు. సో హిట్ కాంబో రిపీట్ అవుతుంది కాబట్టి ఈ సినిమా తప్పకుండా అంచనాలను రీచ్ అయ్యేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇన్నాళ్లు బాలీవుడ్ ఆడియన్స్ ని అలరించిన జాన్వి కపూర్ తొలిసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తుంది. అందంతోనే కాదు అభినయంతో కూడా ఇక్కడి ప్రేక్షకుల మనసులు గెలవాలని చూస్తుంది అమ్మడు. అంతకుముందు చాలా ఆఫర్లు వచ్చినా దేవరలో తన పాత్ర నచ్చి జాన్వి సినిమాకు ఓకే చేసింది. తప్పకుండా ఈ సినిమా ఆమెకు టాలీవుడ్ లో గ్రాండ్ వెల్కం చెబుతుందని భావిస్తున్నారు.