బిగ్ బాస్ 8 : ఫ్యామిలీ వీక్ కి పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్..!

బిగ్ బాస్ సీజన్ 8 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. హౌస్ మెట్స్ వారి వారి ఫ్యామిలీస్ అంతా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వారికి ఇవ్వాల్సిన బూస్టింగ్ ఇచ్చారు.

Update: 2024-11-16 04:14 GMT

బిగ్ బాస్ సీజన్ 8 లో ఫ్యామిలీ వీక్ ముగిసింది. హౌస్ మెట్స్ వారి వారి ఫ్యామిలీస్ అంతా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి వారికి ఇవ్వాల్సిన బూస్టింగ్ ఇచ్చారు. ఆట మార్చుకోవాలి అన్న వారికి అలా.. ఇంకాస్త గట్టిగా ఆడాలన్న వారికి మరోలా మొత్తానికి ఫ్యామిలీ వీక్ తర్వాత హౌస్ మెట్స్ అంతా వారి వారి ప్రవర్తనలో మార్పు తెచ్చుకున్నారు. అది ఆడియన్స్ కు స్పష్టంగా తెలుస్తుంది. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో ఫ్యామిలీ వీక్ మరింత ఎమోషనల్ అయ్యేలా చేశాడు టేస్టీ తేజ. ఎందుకంటే లాస్ట్ వీక్ అతనికి హౌస్ లో వరస్ట్ కంటెస్టెంట్ గా హౌస్ మెట్స్ ఎక్కువ ఓట్స్ రాగా దాని వల్ల హోస్ట్ నాగార్జున ఫ్యామిలీ వీక్ లో వారి పేరెంట్స్ రారని చెప్పాడు.

అక్కడ నుంచి మొదలైన తేజ కన్నీళ్ల ప్రవాహం వాళ్ల అమ్మ లక్ష్మి వచ్చే వరకు కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ నబీల్ అమ్మ గారు హౌస్ లోకి రాగా ఆ తర్వాత రోహిణి మదర్ హౌస్ లోకి వచ్చారు. ఆ తర్వాత నిఖిల్ మదర్, అవినాష్ భార్య, పృధ్వి మదర్, విష్ణు ప్రియ ఫాదర్, గౌతం అన్నయ్య చివరకు రాడు అనుకున్న ప్రేరణ భర్త కూడా వచ్చాడు. ఇంతటితో ఫ్యామిలీ వీక్ ముగిసింది అని తేజాని మరోసారి నిరాశ పరచిన బిగ్ బాస్.. రాత్రి ఫోన్ కాల్ తో అతని మదర్ తో మాట్లాడించాడు.

ఆ టైం లో తేజ మరింత ఎమోషనల్ అవుతుండగా చిన్నగా అతని మదర్ ని హౌస్ లోకి పంపించాడు. తేజ గాడి అమ్మ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చింది అంటూ తేజా చాలా సంతోషించాడు. బిగ్ బాస్ ఇక నేను గెలిచేశాను. లాస్ట్ సీజన్ హౌస్ లో నుంచి వెళ్లాక 9 నెలలు చాలా బిజీగా ఉన్నాను. మళ్లీ బిగ్ బాస్ ఛాన్స్ రాగానే ఈసారి ఎలాగైనా అమ్మని హౌస్ లోకి తీసుకు రావాలని అనుకున్నానని తేజ చెప్పుకొచ్చాడు.

తేజ వాళ్ల మదర్ రావడంతో ఇప్పుడు ఫ్యామిలీ వీక్ పర్ఫెక్ట్ ఎండ్ అయ్యింది అని నబీల్ అన్నాడు. ఇక హౌస్ లోకి వచ్చిన తేజ మదర్ అతని ఆటను మెచ్చుకున్నారు. నువ్వు ఇంత బాగా ఆడతావని అనుకోలేదు అన్ని టాస్క్ లు బాగా ఆడుతున్నావ్.. ఫైనల్ లో నిన్ను చూడాలి అని అన్నారు. ఫ్యామిలీ వీక్ తర్వాత హౌస్ మేట్స్ అంతా డబుల్ ఎనర్జీతో కనిపిస్తున్నారు.

ఇక ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మేట్స్ ఉండగా వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News