ఎవరినీ వదిలిపెట్టనంటున్న నిర్మాత..!
నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో తండేల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది.
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా తండేల్. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు నిర్మించారు. లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా చైతన్య, సాయి పల్లవిల కెమిస్ట్రీ అదిరిపోయింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ వచ్చేలా చేసింది. నాగ చైతన్య కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో తండేల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతుంది.
సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లు అదరగొడుతున్నాయన్న సంతోషంలో ఉన్న మేకర్స్ కి ఈ సినిమా పైరసీ భూతం సినిమాని కిల్ చేస్తుందన్న భయం పట్టుకుంది. ఐతే ఈ విషయంపై చిత్ర నిర్మాతలు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ తండేల్ పైరసీ చేసిన వారిని వదిలిపెట్టేది లేదని అన్నారు. యువకులు ఎవరు ఇందులో ఇరుక్కోవద్దు.. పోలీసులు చాలా ఈజీగా ఐపీ అడ్రస్ లు ట్రాక్ చేస్తారు.. మేము ఆల్రెడీ కేసు ఫైల్ చేశామని అన్నారు బన్నీ వాసు.
అంతేకాదు మేము బాధపడింది ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో కూడా పైరసీ వేస్తున్నారు. రిలీజైన 3వ రోజు ఆర్టీసీ బస్సుల్లో సినిమా వస్తే ప్రొడ్యూసర్స్ ఏం చేయాలి. ఈ పైరసీలో అందరికన్నా ముందు బాధితుడు పవన్ కళ్యాణ్ గారు. అత్తారింటికి దారేది సినిమా రిలీజ్ ముందు లీక్ అయితే అందరం ఉండి ఆ సినిమాకు ఎన్ని కష్టాలు పడ్డామో అందరికీ తెలిసిన విషయమే.. ఈ విషయాన్ని కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం.. సినిమాటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారిని కలుస్తామని అన్నారు బన్నీ వాసు.
ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం.. కేబుల్ ఆపరేటర్స్ కి చెబుతున్నా మాకు ఒక్క వీడియో స్క్రీన్ షాట్ దొరికినా చాలు కేసు ఫైల్ చేసి చివరి వరకు పోరాడుతామని అన్నారు బన్నీ వాసు. గీతా గోవిందం కేసులు ఇప్పటికీ గుంటూరు కోర్ట్ లో ఉన్నాయి. అక్కినేని అభిమానులకు, సినిమా అభిమానులకు ఎక్కడైనా సరే తండేల్ సినిమా ప్లే చేస్తే వీడియో ప్రూఫ్ తో 9573225069 నెంబర్ కి పంపించండి.. మిగతా గ్రూప్స్ లో ఏదైనా ఉంటే అడ్మిన్ వీడియో ప్రూఫ్ తీసి పంపించండి నేను పోరాడుతా అని అన్నారు బన్నీ వాసు.