నాగచైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బిజినెస్.. టాప్ లిస్ట్ ఇదే!

నాగచైతన్య సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న నటుడు.

Update: 2025-02-05 09:25 GMT

నాగచైతన్య సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న నటుడు. కెరీర్ ప్రారంభం నుంచి వరుస విజయాలతో ముందుకు సాగుతూ, కొత్త తరహా కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నాడు. ఏ మాయ చేసావే, 100% లవ్, మనమ్ వంటి ప్రేమకథా చిత్రాలతో రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందిన చైతు, తర్వాత తన కెరీర్‌ను వేరే కోణంలో మలుచుకుంటూ మాస్, యాక్షన్ జానర్లలోనూ దూసుకుపోతున్నాడు.

ఇప్పటివరకు నాగచైతన్య నటించిన చిత్రాల్లో బిజినెస్ పరంగా మంచి ఫలితాలు అందుకున్న చిత్రాలు ఉన్నాయి. అయితే ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినా, ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్ ఉంది. గతంలో వచ్చిన లవ్ స్టోరీ, మజిలీ వంటి సినిమాలు సాలీడ్ కలెక్షన్లు సాధించాయి. కానీ కస్టడీ, థ్యాంక్యూ వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి.

ఇక ఇప్పుడు విడుదలకు సిద్ధమైన తండేల్ సినిమా నాగచైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ బిజినెస్‌ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 37 కోట్లు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమా ఇదే. ఇక విడుదలైన పాటలు, ట్రైలర్‌కు వచ్చిన అద్భుత స్పందనతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తండేల్ ఒక రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడంతో, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేపింది.

నాగచైతన్య రీసెంట్ సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్

తండేల్ - 37 కోట్లు

కస్టడీ - 24.05 కోట్లు

థ్యాంక్యూ - 24 కోట్లు

లవ్ స్టోరీ - 31.20 కోట్లు

మజిలీ - 21.14 కోట్లు

సవ్యసాచి - 23 కోట్లు

తండేల్ చిత్రం కోసం నాగచైతన్య తన లుక్, బాడీ లాంగ్వేజ్‌లో పూర్తిగా మార్పు తీసుకువచ్చాడు. కంటెంట్ బేస్డ్ సినిమాలను ఎంచుకోవడంలో ఆయన ముందంజలో ఉంటూ, తన కెరీర్‌ను వేరే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. తండేల్ విజయంతో, నాగచైతన్యకు పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు వస్తుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధిస్తే, ఆయన మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇప్పటి వరకు నాగచైతన్య సినిమాల ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను పరిశీలిస్తే, అతని సినిమాలకు మంచి డిమాండ్ ఉందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా మజిలీ, లవ్ స్టోరీ వంటి హిట్ సినిమాల తర్వాత, చైతు మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. అయితే తండేల్ ప్రీ రిలీజ్ బిజినెస్ దాటించి, కలెక్షన్లు సాధిస్తే, నాగచైతన్య స్టార్ హీరోగా మరింత స్థిరపడతాడు.

Tags:    

Similar News