టైం గ్యాప్ అంతే టైమింగ్ లో తేడా ఉండదు..!
ఏపీలో ఎన్నికలు అయ్యే వరకు మళ్లీ పవన్ సినిమాల గురించి పట్టించుకోవడం కష్టం.
సెట్స్ మీద ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే అవి లెక్కకు మూడు దాకా ఉన్నాయి కానీ అవి ఎప్పుడు వస్తాయన్నది మాత్రం చెప్పడం కష్టమని అంటున్నారు. సుజిత్ తో చేస్తున్న OG సినిమా మెరుపు వేగంతో కానిచ్చినా సరే అది ఇంకా పూర్తి కాలేదు. ఈలోగా పవన్ పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. ఏపీలో ఎన్నికలు అయ్యే వరకు మళ్లీ పవన్ సినిమాల గురించి పట్టించుకోవడం కష్టం. సుజిత్ OGనే కాదు క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న హరి హర వీరమల్లు, హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ల పరిస్థితి అంతే.
మూడు సినిమాలు ఒకదానికి మించి మరొకటి అనేలా క్రేజీగా ఉన్నాయి. సుజిత్ ఓజీ పవన్ కెరీర్ లో ఫస్ట్ టైం పాన్ ఇండియా అటెంప్ట్ చేయనున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. ఈ సినిమా మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయితే రెండేళ్ల క్రితం మొదలైన హరి హర వీరమల్లు సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోలేదు. సినిమా చాలా లేట్ అవుతున్నా క్రిష్ మాత్రం సినిమాపై సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఎప్పుడొచ్చినా హరి హర వీరమల్లు అదరగొట్టేయడం పక్కా అని అంటున్నారు.
హరీష్ శంకర్ తో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కథే అయినా హరీష్ శంకర్ దాన్ని పూర్తిగా మార్చేసినట్టు తెలుస్తుంది. ఈ 3 సినిమాల మీద పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఈ ఇయర్ ఒక సినిమా అయినా కూడా రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్ ఫ్యాన్స్ లో ఉంది. సుజిత్ OG సెకండ్ హాఫ్ లో రిలీజ్ ప్లానింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సినిమా ఇయర్ ఎండింగ్ కల్లా రాకపోయినా నెక్స్ట్ సంక్రాంతికి వస్తుందని తెలుస్తుంది.
పవన్ సినిమాలు టైం గ్యాప్ తీసుకుంటాయి కానీ టైమింగ్ లో మాత్రం తేడా ఉండదు. కచ్చితంగా పవన్ ఎప్పుడు వచ్చినా సరే తన మార్క్ వసూళ్లతో బాక్సాఫీస్ ని షేక్ చేయడం పక్కా అని నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. ఓజీ, హరి హర, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే కాదు పవన్ మరెన్నో సినిమాలు చేసి ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ ని అలరించాలని కోరుతున్నారు.