టైర్-2 స్టార్ల‌కు వాళ్ల‌తో పెద్ద ముప్పే పొంచి ఉందా?

కోలీవుడ్ హీరోల టాలీవుడ్ మార్కెట్ కు తిరుగు లేదు. సూర్య‌, కార్తీ, విజ‌య్ , ధ‌నుష్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు తెలుగు ఆడియ‌న్స్ క్యూ క‌డ‌తారు

Update: 2024-11-08 16:30 GMT

కోలీవుడ్ హీరోల టాలీవుడ్ మార్కెట్ కు తిరుగు లేదు. సూర్య‌, కార్తీ, విజ‌య్ , ధ‌నుష్ లాంటి స్టార్ హీరోల సినిమాల‌కు తెలుగు ఆడియ‌న్స్ క్యూ క‌డ‌తారు. కోట్ల రూపాయ‌ల వ‌సూళ్లు తెలుగు మార్కెట్ నుంచి జ‌మ అవుతుంటాయి. ఈ మ‌ధ్య మరో యంగ్ హీరో శివ కార్తికేయ‌న్ కూడా బాగా ఫేమ‌స్ అవుతున్నాడు. ఇటీవ‌ల రిలీజ్ అయిన `అమ‌రన్` చిత్రం ఇక్క‌డా భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలోనే `ల‌క్కీ భాస్క‌ర్`, ` క` అనే మ‌రో రెండు తెలుగు చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి.

ఆ సినిమాలు మంచి వ‌సూళ్ల‌ను సాధించాయి. రెండు తెలుగు సినిమాల‌తో పాటు మ‌రో త‌మిళ సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ రావ‌డంతో? కొంత ప్ర‌భావం అయితే ఆ రెండు తెలుగు సినిమాల‌పైనా ప‌డింద‌న్న‌ది నిపుణుల అభి ప్రాయం. ముఖ్యంగా ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ఆ ప్ర‌భావం క‌నిపించింది. ఆక్యుపెన్సీలో కొంత వ్య‌త్యాసం అయితే ఉంది. ఈ రెండు సినిమాల‌తో పాటు `అమ‌రన్` రిలీజ్ కాకుండా ఉండి ఉంటే? థియేట‌ర్లో గ్యాపులు ఫిల్ అయ్యేవి అని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

థియేట‌ర్లు స‌క్ర‌మంగా స‌ర్దుబాటు అయ్యాయి. మూడు సినిమాల కంటెంట్ బాగుంది కాబ‌ట్టి ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అదే తెలుగు సినిమాకి డివైడ్ టాక్ వ‌చ్చి ఉంటే? ప‌రిస్థితి ఎలా ఉండ‌ది? అన్న సందేహాలు రెయిజ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి ప్ర‌భావం టైర్ -2 హీరోల‌పై ప‌డుతుంది. ఈ జాబితాలో ఉన్న చాలా మంది హీరోలు స‌రైన స‌క్సెస్ లేక స‌క్సెస్ కొసం ఎదురు చూస్తున్నారు. కొంత మంది హీరోల మార్కెట్ అయితే మ‌రీ డౌన్ పాల్ లో ఉంది.

కంటెంట్ కొన‌డానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్ప‌డుతుంది. సినిమా అనేది వ్యాపారం. ఆ కోణంలో ఇక్క‌డ నిర్మాత‌ల మ‌ధ్య పోటీ ఉంటుంది. అయితే ఆ పోటీ అనేది టైర్-2 హీరోల మార్కెట్ పై పూర్తి స్థాయిలో ఇంపాక్ట్ ప‌డక ముందే ఇండ‌స్ట్రీ సంఘాలు కొన్ని ర‌కాల జాగ్ర‌త్తలు తీసుకుంటే మంచిద‌ని సూచిస్తున్నారు. లేదంటే రాబోవు రోజుల్లో పెద్ద విపత్తునే చూడాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

Tags:    

Similar News