టైర్ 2 అని తక్కువ కాదండోయ్..?

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోలంతా కూడా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా టైర్ 2 హీరోల డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందుకే వారి రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు.

Update: 2024-05-18 04:01 GMT

స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలతో 300 నుంచి 500 కోట్ల బడ్జెట్ సినిమాలు చేస్తుంటే వారి తర్వాత స్థానంలో ఉన్న టైర్ 2 హీరోలు కాస్త 100 కోట్లకు అటు ఇటుగా సినిమాలు చేసేందుకు ప్రమోట్ అవుతున్నారు. పెరిగిన బడ్జెట్ సమీకరణాల దృష్ట్యా చూస్తే ఒక సినిమా చేయడానికి ఇదివరకు కన్నా ఇప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుందని తెలుస్తుంది. అసలేమాత్రం సినీ అనుభవం లేని వారితో సినిమా చేసినా 3 నుంచి 5 కోట్ల దాకా బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. మొన్నటిదాకా టైర్ 2 హీరోలుగా చెప్పుకునే కొందరు హీరోలతో ఇలా సేఫ్ సైడ్ గా 5 నుంచి 10 కోట్ల లోపు సినిమాలు చేసే వారు.

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. స్టార్ హీరోలంతా కూడా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోగా టైర్ 2 హీరోల డిమాండ్ కూడా బాగా పెరిగింది. అందుకే వారి రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు. టైర్ 2 హీరోలు కూడా ఇప్పుడు సినిమాకు 20 నుంచి పాతిక కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారని తెలుస్తుంది. సినిమా బడ్జెట్ కూడా మొన్నటిదాకా 20, 25 కోట్లు ఉన్న వీరి సినిమాలు ఇప్పుడు 60 నుంచి 80 కోట్ల దాకా వెళ్తున్నాయని తెలుస్తుంది.

టైర్ 2 హీరోల సినిమాలు ఆ రేంజ్ లో వర్క్ అవుట్ అవుతున్నాయా అంటే.. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే ఆలోచించాల్సిన పని లేదు కానీ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోతే మాత్రం డిజిటల్, శాటిలైట్ ఇంకా ఆడియో రైట్స్ రూపంలో కొంత.. థియేట్రికల్ రిలీజ్ తో కొంత రాబట్టుకుంటున్నారు. అయితే కథ కథనాలు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తున్నారు కాబట్టి ఆ సినిమాల సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువ ఉందని చెప్పొచ్చు.

నెక్స్ట్ బిగ్ స్టార్స్ రేసులో ఉన్న కొందరు యువ హీరోల సినిమాలు అనుకున్న దానికన్నా ఎక్కువ సక్సెస్ కావడంతో వారు చేస్తున్న సినిమాలకు బడ్జెట్ లిమిటేషన్స్ పెట్టట్లేదు నిర్మాతలు. అందుకే టైర్ 2 హీరోల సినిమాలు కూడా ఇప్పుడు కోట్లు గుమ్మరించి చేస్తున్నారు. ఏది ఏమైనా టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఓ రకంగా ఇది ఒక పాజిటివ్ నోట్ అని చెప్పొచ్చు. స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ అంటుంటే.. తెలుగు రాష్ట్రాల్లో యువ హీరోలు తమ సత్తా చాటుతున్నారు.

Tags:    

Similar News