చీర కట్టుతో చూపు తిప్పుకోనివ్వని ఆయేషా ఖాన్‌

తెలుగు లో ముఖచిత్రం సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ ఆయేషా ఖాన్‌.

Update: 2024-09-13 17:30 GMT

తెలుగు లో ముఖచిత్రం సినిమాతో పాటు పలు సినిమాల్లో నటించి ప్రస్తుతం లక్కీ భాస్కర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ముద్దుగుమ్మ ఆయేషా ఖాన్‌. హిందీ ప్రేక్షకులకు బుల్లి తెర ద్వారా పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. కెరీర్ ఆరంభంలో బుల్లి తెరపై చేసిన కార్యక్రమాలు, సిరీస్ ల కారణంగా వెండి తెరపై అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ముందు ముందు హిందీలో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా ఆమె సన్నిహితులు, స్నేహితులు చెబుతున్నారు.


హిందీ బిగ్ బాస్ సీజన్‌ 17 లో పాల్గొన్న ఆయేషా ఖాన్ కి మంచి ఫాలోయింగ్‌ దక్కింది. సోషల్‌ మీడియాలో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్ లో దాదాపుగా 5.5 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ని ఏమాత్రం తగ్గకుండా అందాల ఆరబోత చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూ ఉండే ఆయేషా ఖాన్ మరోసారి నెట్టింట షేర్ చేసిన అందమైన ఫోటోల కారణంగా వైరల్‌ అవుతోంది. ఈసారి చీర కట్టి కుర్రకారును చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆకట్టుకునే అందం తన సొంతం అంటూ మరోసారి నిరూపితం చేసింది.


మత్తు కళ్లతో, కవ్వించే విధంగా చూస్తున్న ఆయేషా ఖాన్ తాజా ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంగా ఉన్న ఆయేషా కాస్త బరువు తగ్గితే టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్స్‌ కి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు, మీడియా వర్గాల వారు కామెంట్స్ చేస్తున్నారు. ఎలాంటి ఫోటోలు షేర్‌ చేసినా ఆమె ఫ్యాన్స్ తెగ లైక్ చేస్తూ, షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈసారి ఇంతటి అందమైన ఫోటోలు షేర్‌ చేసినందుకు గాను నెటిజన్స్ చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.


ఏక్తా కపూర్‌ షో కసౌతి జిందగీ కే లో జూనియర్‌ ఆర్టిస్టుగా కెరీర్‌ ను ప్రారంభించిన ఆయేషా ఖాన్‌ తక్కువ సమయంలో బాలీవుడ్‌, టాలీవుడ్‌ లో వరుసగా సినిమాలు చేసే స్థాయికి చేరుకుంది. ముందు ముందు ఈమె తెలుగు, తమిళంలో వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లుగా గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇలాంటి ముద్దుగుమ్మలకు సౌత్‌ లో మంచి ఆధరణ ఉంది. కనుక కాస్త సీరియస్ గా ప్రయత్నిస్తే కచ్చితంగా బాలీవుడ్ లో ఈ అమ్మడికి మంచి అవకాశాలు దక్కడం ఖాయం. టాలీవుడ్‌ లోనూ ఈమె కి ముందు ముందు పెద్ద సినిమాల్లో ఛాన్స్ రావచ్చు.

Tags:    

Similar News