బాత్ ట‌బ్‌లో చేప క‌ళ్ల ప్ర‌ణీత‌

అత్తారింటికి దారేది, బావ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం ప్రణీత సుభాష్. ఈ బ్యూటీ నితిన్ రాజు అనే బిజినెస్ మేన్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే.

Update: 2025-02-16 16:47 GMT

అత్తారింటికి దారేది, బావ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితం ప్రణీత సుభాష్. ఈ బ్యూటీ నితిన్ రాజు అనే బిజినెస్ మేన్ ని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌తులకు ఇద్ద‌రు సంతానం. ప్రణిత - నితిన్ 2021లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో వివాహం చేసుకున్నారు. 2022లో వారి మొదటి బిడ్డకు, అలాగే 2024లో రెండో బిడ్డ‌కు జన్మ‌నిచ్చింది ప్ర‌ణీత‌.


ప్ర‌ణీత వివాహం తర్వాత న‌ట‌వృత్తి నుండి విరామం తీసుకుంది. 2024లో తిరిగి కెరీర్ జ‌ర్నీని ప్రారంభించింది. మలయాళ చిత్రం థంకమణి , కన్నడ చిత్రం రమణ అవతారలో నటించింది. 2021లో చివరిగా హిందీ చిత్రం `భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా`లో కనిపించింది. తెలుగులో బావ చిత్రంతో ప్ర‌ణీత క‌థానాయిక‌గా అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్లో న‌టించింది. ఎన్టీఆర్ బయోపిక్ క‌థానాయ‌కుడు లోను ప్ర‌ణీత న‌టించింది.


ఈ బ్యూటీ తాజాగా ఎక్స్ క్లూజివ్ ఫోటోషూట్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోషూట్ లో ప్ర‌ణీత బాత్ ట‌బ్‌లో సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపించింది. ప్ర‌ణీత డిజైన‌ర్ ఫ్రాక్ లో ముగ్ధ మ‌నోహ‌ర రూపంతో క‌ట్టిప‌డేసింది. అందుకు సంబంధించిన ఫోటోషూట్ ఇప్పుడు వైర‌ల్ గా మారుతోంది. తాజాగా ప్ర‌ణీత లూయీస్ వీట్ట‌న్ తో భారీ డీల్ కుదుర్చుకున్నాన‌ని చెప్పింది. ఈ బ్రాండ్‌ తో మొదటి అనుబంధం.. మా LOలతో మొదటి వాలెంటైన్స్ డే వేడుక అని ప్ర‌ణీత వ్యాఖ్య‌ను జోడించింది. ప్ర‌స్తుతం ప్ర‌ణీత ఎక్స్ క్లూజివ్ ఫోటోలు ఇంట‌ర్నెట్ లో వైరల్ గా మారాయి.

Tags:    

Similar News