నాని హీరోయిన్.. ఘాటైన అందంతో ఊహించని స్టిల్స్
సిద్ధిక శర్మ ‘ఆల్ ది బెస్ట్’ అనే మూవీ ద్వారా హీరోయిన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
సోషల్ మీడియా ఎప్పుడైతే అందుబాటులోకి వచ్చిందో కానీ.. అప్పటి నుంచి దీన్ని చాలా మంది భామలు విపరీతంగా వాడుకుంటున్నారు. తద్వారా ఓ రేంజ్లో హైలైట్ అవడంతో పాటు సినిమా ఛాన్స్‌లను కూడా ఖాతాలో వేసుకుంటున్నారు. అలా ఎంతో మంది ఇప్పటికే సెన్సేషన్ అవగా.. ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ అదే దారిలో వెళ్తోంది. ఆమె ఎవరో కాదు.. ఫేమస్ హీరోయిన్ సిద్ధిక శర్మ.
సిద్ధిక శర్మ ‘ఆల్ ది బెస్ట్’ అనే మూవీ ద్వారా హీరోయిన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో ‘పైసా’ సినిమా చేసి గుర్తింపును సొంతం చేసుకుంది. అప్పటి నుంచి టాలీవుడ్లో పలు రకాల సినిమాల్లో సందడి చేస్తూ సత్తా చాటింది. కానీ, ఈ మధ్య కాలంలో ఆమె అంతగా వెండితెరపై కనిపించడం లేదు. అయితే, ఈ మధ్య మాత్రం ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆపరేషన్ లైలా’ వంటి చిత్రాలతో మెరిసింది.
అప్పుడప్పుడూ సినిమాలు చేసుకుంటూ వెండితెరపై తనదైన మార్కును చూపిస్తున్నప్పటికీ.. సిద్ధిక శర్మ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. ఇలా తరచూ వార్తల్లోనే నిలుస్తూ సిద్ధిక శర్మ తన ఫాలోయింగ్‌ను భారీ స్థాయిలో పెంచుకుంటోంది.
సిద్ధిక శర్మ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ పోస్ట్ చేస్తూ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ రకరకాల ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అలరిస్తుంటోంది. అలా తన అందాలతో కుర్రకారు హృదయాలను దోచుకుంటూ ఉంటోంది. అలా తన ఫాలోవర్స్‌ను తెగ ఫిదా చేసేస్తోంది. దీంతో ఈ నార్త్ బ్యూటీ పేరు తరచూ ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
తాజాగా సిద్ధిక శర్మ నయా పిక్స్‌ను తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసింది. వీటిలో స్టైలిష్ అండ్ షార్ట్ డ్రెస్‌లను ధరించి ఈ అమ్మడు తనదైన రీతిలో అందాలను హైలెట్ చేసింది. దీంతో ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇవి క్షణాల్లోనే వైరల్‌గా మారిపోయాయి.