అంతర్జాతీయంగా అదిరిపోతున్న టాలీవుడ్ ప్రచారం!
టాలీవుడ్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఇప్పుడు దేశంలో దాదాపు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లోనూ ప్రచారం జరుగుతోంది.
తెలుగు సినిమా ప్రచారం అంటే ఒకప్పుడు కేవలం హైదరాబాద్ కే పరిమితమయ్యేది. సినిమా రిలీజ్ కి ముందు హైదరాబాద్ లో మాత్రమే ప్రేక్షకాభికాభిమానుల సమక్షంలో ఓ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేవారు. కానీ నేడు పాన్ ఇండియాని దాటి..అంతర్జాతీయంగానూ రీచ్ అయింది. టాలీవుడ్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఇప్పుడు దేశంలో దాదాపు అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ లోనూ ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై, ముంబై, బెంగుళూరు, ఢిల్లీ ఇలా అన్ని చోట్లా ప్రచారం తప్పని సరిగా మారింది. ఈ మధ్య ఏకంగా వెనుకబడిన బీహార్ లో సైతం తెలుగు సినిమా ప్రచారం మొదలు పెట్టారు. అదే `పుష్ప-2`. బీహార్ రాజధాని పాట్నాలో భారీ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సినిమా ప్రచారం దేశాలు, ఖండాలే దాటి పోతుంది. కొత్తగా అమెరికాలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
`గేమ్ ఛేంజర్`,` డాకు మహారాజ్` ప్రీ రిలీజ్ ఈవెంట్లు అమెరికాలో జరిగాయి. అంతకు ముందు `ఆర్ ఆర్ ఆర్` చిత్రాన్ని జపాన్ లోనూ ప్రత్యకేంగా ప్రమోట్ చేసారు. `బాహుబలి` చిత్రాన్ని వివిధ అంతర్జాతీయ వేదికలపైనా ప్రచారం చేసారు. ఇక ముందు ముందు తెలుగు సినిమా అంతర్జాతీయంగా ప్రచారం పీక్స్ కి చేరిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ సినిమా చైనా, మలేషియా, రష్యా సహా చాలా దేశాల్లో రిలీజ్ అవుతున్నాయి.
ఆయా దేశాల్లోనూ రిలీజ్ కు ముందు ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. నేరుగా సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం కంటే ముందు అందులో నటించిన నటీనటులంతా ఆయా దేశాలు వెళ్లి ప్రచారం చేస్తే మార్కెట్ పరంగా మరింత కలిసొస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారుట. ఎస్ ఎస్ ఎంబీ 29 చిత్రాన్ని రాజమౌళి ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రమోట్ చేస్తారు. ఆ చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రంగా రిలీజ్ చేయాలన్నది ఆయన ప్లాన్.
ఆఫ్రికన్ బ్యాక్ డ్రాప్ లో సాగే అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి రాజమౌళి ఏమాత్రం తగ్గడు. ఇక భారతీయ సినీ పరిశ్రమ నుంచి వివిధ సినీ వేడుకలు ఇప్పటికే దుబాయ్, అమెరికా సహా చాలా దేశాల్లో నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఆ రకంగా భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచానికే తలమానికంగా నిలుస్తుంది.