ఈ ఏడాది వాళ్ళిద్దరిదే హవా

2023 సంవత్సరం టాలీవుడ్ లో టైర్ 2 హీరోలు అందరూ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే వారిలో కొందరికే సక్సెస్ లు వారించారు

Update: 2023-12-31 05:28 GMT

2023 సంవత్సరం టాలీవుడ్ లో టైర్ 2 హీరోలు అందరూ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే వారిలో కొందరికే సక్సెస్ లు వారించారు. అలాగే స్టార్ హీరోలలో కూడా కొంతమందినే విజయాలు వారించారు. సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య రెండేసి సినిమాలని ప్రేక్షకులకి అందించారు. చిరంజీవికి వాల్తేర్ వీరయ్య హిట్ ఇస్తే భోళా శంకర్ డిజాస్టర్ అయ్యింది.

అయితే బాలకృష్ణకి ఈ ఏడాది ఆరంభంలో వీరసింహారెడ్డితో సూపర్ హిట్ వచ్చింది. ఈ మూవీ వాల్తేర్ వీరయ్య కంటే ఎక్కువ ఓపెనింగ్ డే కలెక్షన్స్ అందుకోవడం విశేషం. సంక్రాంతి బరిలో బాలయ్య మరోసారి తన పవర్ చూపించి సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ఏడాది ఆఖరులో భగవంత్ కేసరితో మరో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాలయ్య కంపర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి చేసిన మూవీ కావడం విశేషం.

బాలయ్యతో కంప్లీట్ యాక్షన్ మూవీస్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్ కలగలిపిన కథలు కూడా చెప్పొచ్చు అని భగవంత్ కేసరి ప్రూవ్ చేసింది. ఈ రెండు బాలయ్య కెరియర్ కి ఊపు తీసుకొచ్చాయి చాలా ఏళ్ల తర్వాత మొదటి సారిగా బాలయ్యకి రెండు విజయాలు బ్యాక్ టూ బ్యాక్ వచ్చాయి. అలాగే అఖండతో హ్యాట్రిక్ హిట్స్ ఖాతాలో చేరాయి.

టైర్ 3 హీరోలలో మాస్ మహారాజ్ రవితేజ ఏకంగా మూడు సినిమాలని ప్రేక్షకులకి అందించారు. అలాగే నేచురల్ స్టార్ నాని రెండు చిత్రాలని రిలీజ్ చేశారు. అయితే రవితేజకి వాల్తేర్ వీరయ్య మాత్రమే సక్సెస్ ఇచ్చింది. సోలోగా వచ్చిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ అయ్యాయి. కొత్తగా ట్రై చేసిన టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు.

అయితే నాని మాత్రం ఈ ఏడాది దసరాతో ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ మూవీగా ఆ చిత్రం నిలిచింది. అలాగే అతనికి మాస్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఏడాది ఆఖరులో వచ్చిన హాయ్ నాన్నతో సెకండ్ సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీలో తండ్రి కూతుళ్ళ ఎమోషనల్ ఎలిమెంట్ ని అద్భుతంగా పండించి ఫ్యామిలీ హీరో అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇలా ఈ ఏడాది బాలయ్య, నానిలకి భాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News