సవాల్ విసిరింది కాబట్టే హాట్ బ్యూటీ బోల్డ్ అటెంప్ట్!
`యనిమల్` లో `జోయా` పాత్ర ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వడంతోనే ఇదంతా సాధ్యమైంది. అయితే ఈ పాత్ర విషయంలో అమ్మడు కొన్ని రకాల విమర్శలకు గురైంది.
`యానిమల్` సక్సెస్ తో పాన్ ఇండియా లో త్రిప్తీ డిమ్రీ ఎంతగా ఫేమస్ అయిందో తెలిసిందే. ఒక్క సక్సెస్ అమ్మడిని రాత్రి కి రాత్రే స్టార్ భామల సరసన కూర్చెబెట్టింది. అప్పటి వరకూ త్రిప్తీని హిందీ సినిమాల్లోకి తీసు కోవాలంటే ఆలోచించేవారు. కాళ్ల వరకూ వచ్చిన అవకాశాలెన్నో వెనక్కి వెళ్లిపోయాయి. కానీ `యానిమల్` విజయంతో దర్శక, నిర్మాతలే ఆమె వెంట పడుతున్నారు. సక్సెస్ కొడితే ఇలా ఉంటుందని నిరూపించింది.
`యనిమల్` లో `జోయా` పాత్ర ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అవ్వడంతోనే ఇదంతా సాధ్యమైంది. అయితే ఈ పాత్ర విషయంలో అమ్మడు కొన్ని రకాల విమర్శలకు గురైంది. యానిమల్ స్త్రీ ద్వేష చిత్రమా? అన్న వాదన తెరపైకి వచ్చింది. అయితే ఈ సినిమాను త్రిప్తీ ఎప్పుడూ స్త్రీ ద్వేషా చిత్రంగా చూడలేదంది. సినిమాలకు అలాంటి ట్యాగ్ కూడా ఇవ్వనంది. `కోలా`, `బుల్బుల్` చిత్రాల్లో నటిస్తున్నప్పుడు వాటిని స్త్రీవాదా చిత్రాలుగా భావించలేదంది.
కేవలం ఆ కథలో పాత్రలకు మాత్రమే కనెక్ట్ అయ్యానంది. ఇలాంటి ఎంపికలు కేవలం దర్శకులపై నమ్మకంతోనే జరుగుతుందంది. `యానిమల్` లో అవకాశం రాగానే వెంటనే దర్శకుడు సందీప్ ను కలిసాను. ఆయన కథ గురించి పెద్దగా చెప్పలేదు. కేవలం నా పాత్ర గురించి మాత్రమే చెప్పారు. ఈ సినిమా వరకూ కేవలం సున్నితమైన పాత్రలే పోషించా. యానిమల్ లో పాత్ర అందుకు భిన్నమైంది.
మనసులో మోసం చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ దయా, సానుభూతి కనిపించాలని దర్శకుడు చెప్పారు. అది నాకు ఎంతో సవాల్ గా అనిపించిందంది. ఆ సినిమాలో ఆ పాత్ర చేయడానికి అదే ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుతం త్రిప్తీ డిమ్రీ బాలీవుడ్ లో బిజీగా సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. సౌత్ లోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి.