.consent-eea { display:none; } .consent-ccpa{ display:none; } .amp-geo-group-eea .consent-eea { display:block; } .amp-geo-group-ccpa .consent-ccpa { display:block; }

త్రిప్తీ డిమ్రీ దిల్ ఇప్పుడు ఫుల్ ఖుష్!

`యానిమ‌ల్` విజ‌యంతో పాన్ ఇండియా లో త్రిప్తీ డిమ్రీ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో తెలిసిందే.

Update: 2024-07-01 08:30 GMT

`యానిమ‌ల్` విజ‌యంతో పాన్ ఇండియా లో త్రిప్తీ డిమ్రీ ఏ రేంజ్ లో ఫేమ‌స్ అయిందో తెలిసిందే. ఒక్క స‌క్సెస్ అమెని రాత్రి కి రాత్రే స్టార్ భామ‌ల జాబితాలో చేర్చేసింది. చేసింది చిన్న పాత్ర అయినా అగ్ర ప‌థాన కూర్చోబెట్టింది. ఏడేళ్ల క్రితమే బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించినా 2023 వ‌ర‌కూ త్రిప్తీ ఎవ‌రో స‌రిగ్గా తెలియ‌కుండానే సినిమాలు చేసింది. చెప్పుకోవ‌డానికి ఐదు సినిమాలు చేసింది గానీ వాటిలో ఏది కూడా స‌రైన గుర్తింపును తీసుకురాలేదు.


కానీ తాను పెట్టాల్సిన ఎఫెర్ట్ అంతా పెట్టి ప‌ని చేసింది. న‌టిగా ఎలాంటి హ‌ద్దులు లేకుండానే పెర్పార్మెన్స్ చేసింది. కానీ ఫ‌లితం మాత్రం శూన్యంగానే క‌నిపించింది. ఏదైనా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు స‌క్స‌స్ వ‌స్తుంది అన్న‌ట్లు అలాంటి విజ‌యం రావ‌డానికి ఏడేళ్లు ప‌టింది. తాజాగా ఈ జ‌ర్నీని ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. `అభిమానులు నా ప‌ని గురించి మాట్లాడాల‌నేది నాకు ఎప్ప‌టి నుంచో ఉన్న కోరిక‌.

వాళ్ల‌కిప్పుడు కృత‌జ్ఞ‌త చెప్పే స‌రైన స‌మ‌యం ఇదే. చేసిన సినిమాలు కొన్నే అయినా వాటి లో ఏది తృప్తినివ్వ‌లేదు. అలాంటి తృప్తిని యానిమ‌ల్ ఇచ్చింది. ప్రేక్ష‌కులు ప్రేమించ‌డం అన్న‌ది ఇప్పుడే మొద‌లైంది. ఎప్ప‌టి నుంచో నా గురించి మాట్లాడాలి అనుకుంటోన్న‌ది ఇప్పుడు జ‌రిగింది. నేను ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చిన కొత్త‌లోనే అలా అనుకున్నాను. కాల‌క్ర‌మంలో ప‌రాజ‌యాలు వ‌చ్చే కొద్ది ఆ కోరిక మ‌రింత బ‌లంగా మారింది.

ఎలాగైనా ప్రేక్ష‌కుల‌తో షెభాష్ అని పించుకోవాలి అన్న ప‌ట్టుద‌ల పెరిగింది. ప్రేక్ష‌కుల ప్ర‌శంస అన్న‌ది న‌టీన‌టుల‌కు ఎంతో కీల‌కం. మ‌రింత మెరుగ్గా, క‌ష్ట‌ప‌డి ప‌నిచేయ‌డానికి అవి ఎంత‌గానో ఉప‌యోగ ప‌డ‌తాయి. ల‌క్కీగా ఇప్పుదే స్టేజ్ లో ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. నాకిప్పుడు గాల్లో విహ‌రిస్తున్న‌ట్లు అనిపిస్తుంది` అని తెలిపింది.

Tags:    

Similar News