అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ బిగ్గెస్ట్ ఛాలెంజ్
`పుష్ప 2` పాన్ ఇండియాలో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
'పుష్ప 2' పాన్ ఇండియాలో విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారతీయ సినిమా హిస్టరీలో చాలా రికార్డులను ఈ చిత్రం బ్రేక్ చేసింది. ప్రఖ్యాత యష్ రాజ్ ఫిలింస్ సైతం 'పుష్ప 2' రికార్డులను కొనియాడింది. పుష్పరాజ్ గా అల్లు అర్జున్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు జేజేలు పలికారు. ఇదిలా ఉండగానే, బన్ని తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడని కొద్దిరోజులుగా కథనాలొస్తున్నాయి.
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి బన్ని తదుపరి చిత్రం ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో తాజా అప్ డేట్ వేడి పెంచుతోంది. ఇటీవల దుబాయ్ వెకేషన్ తర్వాత అల్లు అర్జున్ హైదరాబాద్‌కు తిరిగి వచ్చి తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారని సమాచారం. హరిక & హాసిని క్రియేషన్స్ తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం సర్వసన్నాహకాల్లో ఉందని, దీనికోసం భారీ బడ్జెట్ ని వెచ్చించనుందని కథనాలొస్తున్నాయి.
అంతేకాదు.. నిర్మాత నాగ వంశీ ఈ చిత్రం పూర్తిగా కొత్తదనంతో ఇన్నోవేటివ్ స్టోరీతో తెరకెక్కనుందని కూడా హింట్ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రిప్ట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం.. తుది స్క్రిప్ట్‌ను ఖరారు చేయడానికి అల్లు అర్జున్ - త్రివిక్రమ్ త్వరలో సమావేశం కానున్నారు. హైదరాబాద్ లో త్రివిక్రమ్ తో బన్ని కథా చర్చల్లో పాల్గొని ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. పుష్ప 2 సంచలన విజయం నేపథ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ తో సినిమాపైనా అంచనాలు చుక్కల్ని తాకుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వారి స్క్రిప్టు ఎంపిక, బడ్జెట్, కాన్వాస్ ప్రతిదీ కీలకం కానున్నాయి. ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్, అందులో సన్నివేశాలు, యాక్షన్ కంటెంట్ ఇలా ప్రతిదీ పదే పదే స్క్రుటినీకి వెళతుంది. పాన్ ఇండియన్ ఆడియెన్ కి కనెక్టివిటీ పాయింట్ ఏమిటన్నది దర్శకుడు, హీరో మధ్య సుదీర్ఘ చర్చ సాగుతుందని చెబుతున్నారు. ఒకసారి స్క్రిప్టు లాక్ అయ్యాక.. బన్ని తన పాత్రకు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్, మాండలికంపై పని చేస్తాడు. ఈ చిత్రం 2025 వేసవిలో సెట్స్ పైకి వెళుతుందని కూడా చెబుతున్నారు.
అల్లు అర్జున్-త్రివిక్రమ్ కలయికలో సినిమా అనగానే అభిమానులను అది ఎంతో ఎగ్జయిట్ చేస్తుంది. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్లు అయ్యాయి. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో చిత్రాలు భారీ విజయాల్ని సాధించాయి. ఇప్పుడు నాలుగో ప్రయత్నం పాన్ ఇండియా లెవల్లో సాగుతుండడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ప్రాజెక్ట్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఎక్కువ భాగం భారీ (ఇల్లు) సెట్‌లో చిత్రీకరించనున్నారని సమాచారం.