లీక్డ్ బాత్రూమ్ వీడియోపై ఊర్వ‌శి ఆందోళ‌న‌

దీంతో ఊర్వ‌శి కొన్ని జిమ్మిక్కులు చేస్తోంద‌ని, సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌లో హ‌ద్దు మీరి చెల‌రేగుతోంద‌ని నెటిజ‌న‌లు కామెంట్లు చేస్తున్నారు.

Update: 2024-07-28 05:50 GMT

ఊర్వశి రౌతేలా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో చిరంజీవి, గోపిచంద్ వంటి స్టార్ల సినిమాల్లో ఈ భామ న‌టించింది. త‌దుప‌రి న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలోను న‌టిస్తోంది. ఐట‌మ్ నంబ‌ర్ల‌తో ఇప్ప‌టికే తెలుగు యువ‌త‌ను మురిపించింది. మ‌రోవైపు బాలీవుడ్ లో ఈ భామ న‌టిస్తున్నా ఆశించినంత పెద్ద అవ‌కాశాలైతే రాలేదు. దీంతో ఊర్వ‌శి కొన్ని జిమ్మిక్కులు చేస్తోంద‌ని, సోష‌ల్ మీడియా ఫోటోషూట్ల‌లో హ‌ద్దు మీరి చెల‌రేగుతోంద‌ని నెటిజ‌న‌లు కామెంట్లు చేస్తున్నారు.

ఇటీవ‌లే లీకైన ఊర్వ‌శి రౌతేలా బాత్రూమ్ ఎం.ఎం.ఎస్ క్లిప్ పైనా తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈ వీడియో వీక్షించిన వారంతా ఇందులో ఏమీ లేద‌ని, దీనిని కావాల‌నే త‌న సినిమా ప్ర‌చారం కోసం ఊర్వ‌శి త‌న‌కు తానే లీక్ చేసింద‌ని నెటిజనులు దుమ్మెత్తిపోసారు. ప్ర‌చారం కోసం చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోంద‌ని విమ‌ర్శించారు.

అయితే ఆ ఎం.ఎం.ఎస్ క్లిప్ గురించి ఊర్వ‌శి వీలున్న ప్ర‌తి వేదిక‌పైనా మాట్లాడుతోంది. ఇప్పుడు తన లీక్డ్ బాత్రూమ్ వీడియో గురించి మ‌రోసారి ఓపెన్ అయింది. ఈ వీడియో తన త‌దుప‌రి చిత్రం `ఘుస్పైతియే` నుండి వచ్చినదని ఊర్వ‌శి ఒప్పుకుంది. ఇది తన సినిమాలోనిదే అయినప్పటికీ ఆ వీడియో ఆన్‌లైన్‌లో `లీక్` అయినందుకు తాను కలత చెందానని తెలిపింది. ``క్లిప్ బయటకు వెళ్లిన రోజు, ఆ స‌మ‌యంలో నేను కలత చెందాను. వాస్తవానికి ఇది నా వ్యక్తిగత జీవితం కాదు.. ఇది నా వ్యక్తిగత క్లిప్ కాదు.. ఇది `ఝ‌స్పైతియే` సినిమాలో భాగం`` అని ఊర్వ‌శి అన్నారు. తన పర్సనల్ క్లిప్ ఎప్పుడైనా లీక్ అయ్యిందా అని ఇంట‌ర్వ్యూవ‌ర్ ప్ర‌శ్నించ‌గా, ``లేదు.. లేదు, ఏ స్త్రీ ఇలాంటివి చేయకూడదని నేను కోరుకుంటున్నాను`` అని చెప్పింది.

అయితే కొన్ని రోజుల క్రితం ఊర్వశి బాత్రూమ్ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవ్వ‌డం గంద‌ర‌గోళానికి దారి తీసింది. త‌న‌ గోప్యతకు భంగం క‌లిగించిన ఈ క్లిప్ పూర్తిగా PR స్టంట్ అని నెటిజన్లు చర్చించుకున్నారు. కానీ ఇంత‌లోనే ఊర్వశి తన మేనేజర్‌తో మాట్లాడిన‌ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయింది. రికార్డింగ్‌లో ఊర్వశి తన మేనేజర్‌ని నిల‌దీసారు. ``మీరు వీడియో చూశారా? ఈ విషయాలు ఎలా బయటకు వెళ్తున్నాయో నాకు అర్థం కావడం లేదు. నేను వెంటనే వారితో మాట్లాడాలి`` అని ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌గా, సోషల్ మీడియా నుండి వీడియోను తీసివేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఊర్వ‌శి మేనేజర్ హామీ ఇచ్చారు. ఇలాంటివి వ్యక్తిగతంగా మాట్లాడాలని, ఇలా కాల్‌లో మాట్లాడకుండా ఉండాల్సింద‌ని కూడా అత‌డు అన్నారు. ఊర్వ‌శి న‌టించిన‌ ఘుస్పైతియే ఆగస్టు 9న విడుదల కానుంది. ఇందులో అక్షయ్ ఒబెరాయ్ స‌ర‌స‌న‌ ఊర్వశి నటించింది. ఈ చిత్రానికి సుశి గణేశన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఆసుపత్రిలో చేరిన ఊర్వ‌శి:

ఊర్వశి ఈ నెల ప్రారంభంలో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరింది. ఇటీవల హైదరాబాద్‌లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం NBK 109 చిత్రీక‌ర‌ణ‌లో ఊర్వ‌శి పాల్గొంటోంది. యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఊర్వ‌శి గాయపడింది. అనంత‌రం ఊర్వశి బృందం ఆసుపత్రిలో చేరిన వార్తలను ధృవీకరించింది. త‌న‌కు భయంకరమైన ఫ్రాక్చర్ అయింద‌ని టీమ్ వెల్లడించింది. ప్రస్తుతం నొప్పితో బాధపడుతోంది.. ఇలాంటి స‌మ‌యంలో త‌న‌కు అన్నింటికంటే ఉత్తమమైన చికిత్సలు అందుతున్నాయని వారు తెలిపారు.



Tags:    

Similar News