బేబీ తర్వాత కూడా నో ఛాన్స్!?

పెళ్ళిసందడి ఫ్లాప్ అయిన సెకండ్ మూవీ ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు ఏకంగా 10 సినిమాలని చేతిలో పెట్టుకుంది

Update: 2023-08-25 04:08 GMT

టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరైనా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటే వెంటవెంటనే వారికి వరుసగా మూడు, నాలుగు అవకాశాలు వస్తాయి. టైర్ 2 హీరోలు ఆ క్రేజీ హీరోయిన్స్ గా నటించడానికి రెడీ అవుతారు. అలాగే దర్శకులు కూడా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇది ఎప్పుడూ జరిగేది. అందుకే హీరోయిన్ అందరూ కూడా ఫస్ట్ చిత్రంతో వండర్ చేయాలని అనుకుంటారు.

ఈ జాబితాలో పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 తో హిట్ కొట్టి బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ సొంతం చేసుకుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఉప్పెన సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న కృతిశెట్టి నెక్స్ట్ నానితో శ్యామ్ సింగరాయ్, చైతూతో బంగార్రాజు, నితిన్ తో మాచర్ల నియోజకవర్గం, రామ్ తో ది వారియర్ సినిమాలు చేసింది. ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న శ్రీలీల కూడా అంతే.

పెళ్ళిసందడి ఫ్లాప్ అయిన సెకండ్ మూవీ ధమాకాతో బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు ఏకంగా 10 సినిమాలని చేతిలో పెట్టుకుంది. అందులో స్టార్ హీరోల మూవీస్ కూడా ఉండటం విశేషం. ఇలా చాలా మంది హీరోయిన్స్ మొదటి, రెండో సినిమాతో మంచి సక్సెస్ అందుకొని స్టార్స్ గా మారిపోతారు. అయితే తెలుగమ్మాయిలకి టాలీవుడ్ లో ఈ ఫార్ములా వర్తించదనే అభిప్రాయం వైష్ణవి చైతన్య విషయంలో మరోసారి ప్రూవ్ అయినట్లే కనిపిస్తోంది.

బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకుంది. అలాగే తన డాన్స్ గ్రేస్ తో కట్టిపడేసింది. గ్లామర్ గా కూడా కనిపించింది. అన్నింటికి మించి ఎవ్వరూ ఊహించని సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ఒక్కసారిగా బేబీతో వైష్ణవి చైతన్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. తెలుగమ్మాయిలలో స్టార్ హీరోయిన్ అయ్యే ఛాన్స్ వైష్ణవికి ఉందని అందరూ భావించారు.

అయితే మొదటి సినిమా ఇంత భారీ సక్సెస్ అయిన ఇంకా రెండో సినిమా ఛాన్స్ ఈ బ్యూటీకి రాలేదు. కెరియర్ పరంగా ఎలాంటి స్పీడ్ లేదు. పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ కోసం వైష్ణవిని తీసుకున్నారనే ప్రచారం మాత్రం నడుస్తోంది. అఫీషియల్ గా దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే గీతా ఆర్ట్స్ లో ఒక మూవీకి ఒప్పందం చేసుకుందని టాక్ వినిపిస్తున్న అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. తెలుగమ్మాయిలకి తెలుగు సినిమాలలో ఎంత సక్సెస్ కొట్టిన ఆఫర్స్ పెద్దగా రావనే నెగిటివ్ అభిప్రాయం టాలీవుడ్ పై ఉంది. వైష్ణవి విషయంలో కూడా అదే నిజమయ్యేలా కనిపిస్తుందని సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నారు.

Tags:    

Similar News