వరలక్ష్మి పెళ్లి వేడుక విశేషాలు

కోలీవుడ్‌ సీనియర్ స్టార్‌ నటుడు శరత్‌ కుమార్‌ కూతురు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది

Update: 2024-07-03 10:13 GMT

కోలీవుడ్‌ సీనియర్ స్టార్‌ నటుడు శరత్‌ కుమార్‌ కూతురు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా స్టార్‌ హీరోయిన్‌ గా, మంచి నటిగా ఎదిగింది అనడంలో సందేహం లేదు.

వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తన ప్రియుడు నికోలై సచ్‌దేవ్‌ తో పెళ్లికి రెడీ అయ్యింది. ఇరు వైపుల కుటుంబ పెద్దల అంగీకారంతో మార్చి నెలలోనే వివాహ నిశ్చితార్థం జరిగింది. గత 15 రోజులుగా వరలక్ష్మి మరియు నికోలై సచ్‌దేవ్‌ లు పెళ్లి కార్డులు పట్టుకుని దేశం మొత్తం తిరిగేశారు. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులకు వివాహ ఆహ్వాన కార్డ్‌ లు అందించారు.

ప్రధాని నరేంద్ర మోడీ మొదలుకుని తమిళ్‌ ముఖ్యమంత్రి స్టాలిన్‌ వరకు ఇక టాలీవుడ్ మరియు కోలీవుడ్‌ లో ఎంతో మంది స్టార్స్ కి కూడా వరలక్ష్మి వివాహ ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెల్సిందే. నేడు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మరియు నికోలై సచదేవ్‌ ల వివాహం వైభవంగా జరిగింది.

గత రెండు మూడు రోజులుగా పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను వరలక్ష్మి సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేస్తున్న విషయం తెల్సిందే. వరలక్ష్మి శరత్‌ కుమార్‌ పెళ్లి వేడుక లో అనుకున్నట్లుగానే సినీ ప్రముఖులు ఎంతో మంది హాజరు అయ్యారు.

Read more!

నూతన వధూవరులను ఆశీర్వ దించేందుకు వివాహానికి హాజరు అయిన రాజకీయ మరియు సినీ ప్రముఖుల జాబితా చాలా పెద్దగా ఉందంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెళ్లికి సంబంధించిన ఫోటోలను వరలక్ష్మి షేర్‌ చేయలేదు.

మరి కొన్ని గంటల్లోనే ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో నిండి పోనున్నాయి. మొత్తానికి పెళ్లి చేసుకుని కొత్త జీవితంలో అడుగు పెట్టిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మరియు నికోలై సచ్‌దేవ్‌ లకు మీ తరపున మరియు మా తరపున శుభాకాంక్షలు.

Tags:    

Similar News

eac