షూటింగ్ చేస్తుంటే హీరోని అరెస్ట్ చేసారు

2015లో విమర్శకుల ప్రశంసలు పొందిన `మసాన్‌` చిత్రంతో అద్భుతమైన‌ అరంగేట్రం చేసాడు.

Update: 2024-05-20 10:30 GMT

2015లో విమర్శకుల ప్రశంసలు పొందిన `మసాన్‌` చిత్రంతో అద్భుతమైన‌ అరంగేట్రం చేసాడు. వ‌రుస చిత్రాల్లో త‌న‌దైన అద్భుత న‌ట‌న‌తో ప్రేక్షకులను అబ్బురపరిచాడు. అవార్డులు రివార్డులు కొల్ల‌గొట్టాడు. భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉన్న అత‌డు హిందీ చిత్రసీమలో అత్యంత ఆకర్షణీయమైన ప్రతిభావంతుల్లో ఒకడిగా జేజేలు అందుకుంటున్నాడు. నిజానికి అత‌డు హీరో అవ్వ‌క మునుపు సహాయ దర్శకుడిగా పనిచేశాడు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ వంటి చిత్రాలకు సహాయ‌ద‌ర్శ‌కుడిగా ప‌ని చేసాడు. అప్ప‌ట్లోనే అత‌డిని పోలీసులు అరెస్ట్ చేసారు కూడా. ఇంత‌కీ ఎవ‌రా హీరో? ఎందుకు అరెస్ట‌య్యాడు? అంటే.. వివ‌రాల్లోకి వెళ్లాలి.

ఈ వివ‌రాల‌న్నీ యంగ్ ట్యాలెంటెడ్ హీరో విక్కీ కౌశ‌ల్ గురించే. యూరి లాంటి దేశ‌భ‌క్తి చిత్రంతో అత‌డికి ఇప్పుడు తెలుగు ప్రేక్ష‌కుల్లోను ఫాలోవ‌ర్స్ ఉన్నారు. విక్కీ న‌టించిన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రం విడుద‌లై ప‌దేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు అనురాగ క‌శ్య‌ప్ క‌పిల్ శ‌ర్మ షోలో మాట్లాడాడు. ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఓ విషయాన్ని వెల్లడించారు. ``అప్ప‌ట్లో అనుమతి లేకుండానే రియ‌ల్ లొకేషన్‌లో షూటింగ్‌ చేశాం. షూటింగ్‌లో ఉండగానే అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇసుక తవ్వకాలు మాఫియా ప‌ని. ఈ సమయంలో విక్కీని అరెస్టు చేశారు``అని తెలిపాడు.

ఇసుక మాఫియా లొకేషన్‌లో షూటింగ్ చేసినందుకు అక్రమ కార్యకలాపాల కేసులో విక్కీని అరెస్టు చేశారు. కానీ హరాంఖోర్ దర్శకుడు శ్లోక్ శర్మ విక్కీ కౌశల్‌ను విడిపించారు. అంతేకాదు రెండుసార్లు విక్కీ జైలుకు వెళ్లాడు అని అనురాగ్ తెలిపారు. అనురాగ్ చెప్పిన దానిని బ‌ట్టి ఇసుక మాఫియా వ్య‌క్తి అనుకుని వీక్కిని పోలీసులు అరెస్ట్ చేసారు. కానీ అత‌డు ఆ లొకేష‌న్ లో కేవ‌లం షూటింగ్ కోసం ఉన్నాడ‌న్నది వారికి తెలీదు!

మనోజ్ బాజ్‌పేయి, పీయూష్ మిశ్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, హుమా ఖురేషి, వినీత్ కుమార్, పంకజ్ త్రిపాఠి త‌దిత‌రులు అనురాగ్ తో పాటు ఈ షోలో పాల్గొన్నారు. 2012లో విడుదలైన గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్ చిత్రానికి సహాయ దర్శకుడిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విక్కీ కౌశల్ ఆ తర్వాత న‌టుడిగా మళ్లీ వెనక్కి తిరిగి చూడ‌లేదు.

Tags:    

Similar News