వీడియో: బాల‌న్‌కి సిస‌లైన‌ మాస్ శిష్యురాలు?

హీరోయిన్ల బాడీ లాంగ్వేజ్ లో మాసిజం అనేది కొంద‌రిలో కొట్టొచ్చిన‌ట్టు కనిపిస్తుంది. వేదిక‌ల‌పై అది బ‌య‌ట‌ప‌డుతుంటుంది.

Update: 2024-10-24 07:18 GMT

హీరోయిన్ల బాడీ లాంగ్వేజ్ లో మాసిజం అనేది కొంద‌రిలో కొట్టొచ్చిన‌ట్టు కనిపిస్తుంది. వేదిక‌ల‌పై అది బ‌య‌ట‌ప‌డుతుంటుంది. అలాంటి మాసిజంతోనే విద్యా బాల‌న్ లాంటి సీనియ‌ర్ న‌టి భారీ క్రేజీ ఆఫ‌ర్లు అందుకుంది. చూడ‌టానికి చీర‌ల్లో ఎంత ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తుందో, మోడ్ర‌న్ దుస్తుల్లో, ముఖాభిన‌యం, బాడీ లాంగ్వేజ్ లో అంత మాసీగా క‌నిపించ‌డం విద్యాకే చెల్లింది. అందుకే ఈ బ్యూటీని సిల్క్ స్మిత బ‌యోపిక్ వెతుక్కుంటూ వెళ్లింది. డ‌ర్టీపిక్చ‌ర్ లో బెజ‌వాడ‌ విజ‌య‌ల‌క్ష్మి అలియాస్ సిల్క్ స్మిత పాత్ర‌లో బాల‌న్ అభిన‌యించిన తీరు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ భామ‌కు తెలుగు లోగిళ్ల‌లోను మంచి గుర్తింపు రావ‌డానికి కార‌ణం సిల్క్ స్మిత‌గా అభిన‌యించ‌డం.

మాసీ ఫ్లిర్టీ ఎక్స్ ప్రెష‌న్స్ తో సిల్క్ పాత్ర‌లో బాల‌న్ ఇచ్చిన ట్రీట్ ని దేశ‌వ్యాప్తంగా అభిమానులు అంత తేలిగ్గా మ‌ర్చిపోలేరు. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ బ‌యోపిక్ లో బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో అందుకు భిన్నంగా సాంప్ర‌దాయ‌మైన లుక్ లో క‌నిపించింది బాల‌న్. ఇక‌పోతే ఈ భామ‌కు సిస‌లైన వార‌సురాలు ఈ జ‌న‌రేష‌న్ లో ఎవ‌రున్నారు? అంటూ ఒక‌టే ఆరాలు మొద‌ల‌య్యాయి.

భూల్ భుల‌యా 3 ప్ర‌మోష‌న్స్ లో ఈ డౌట్ కూడా క్లియ‌ర్ అయిపోయింది. క‌చ్ఛితంగా విద్యాబాల‌న్ కి వార‌సురాలిగా యానిమ‌ల్ బ్యూటీ ట్రిప్తీ దిమ్రీని ఎంపిక చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈవెంట్లో బాల‌న్ తో ఎంతో స‌ర‌దాగా స‌న్నిహితంగా క‌నిపించింది ట్రిప్తీ. వేడుక‌లో ఎంతో చిల్లింగ్ గా క‌నిపించారు ఆ ఇద్ద‌రూ. ఈ ఫోటోలు వీడియోలు ఇంట‌ర్నెట్ లోకి రాగానే బాల‌న్ కి నిజ‌మైన శిష్యురాలు ట్రిప్తీ.. అంటూ కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. ఆమె బాడీలో మాస్ ని గుర్తించారు కొంద‌రు. మ‌రోవైపు ట్రిప్తీ ఫేస్ లో అంత‌గా ఎక్స్ ప్రెష‌న్స్ క‌నిపించ‌వ‌ని మండిప‌డేవాళ్ల‌కు కొద‌వేమీ లేదు. అయితే ట్రిప్తీ ఇంకా అర‌డ‌జ‌ను సినిమాల కిడ్ మాత్ర‌మే. బాల‌న్ లాగా స‌దీర్ఘ ఇన్నింగ్స్ ని కొన‌సాగిస్తే కొంత‌కాలానికి అంత‌గా రాటుదేలుతంద‌ని స‌జెష‌న్స్ ఇస్తున్నారు మ‌రికొంద‌రు.

భూల్ భుల‌యా 3 ఈ దీపావ‌ళి కానుక‌గా నవంబ‌ర్ 1న విడుద‌ల కానుంది. కార్తీక్ ఆర్య‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రానికి అనీష్ బ‌జ్మి ద‌ర్శ‌కుడు. మ‌రోవైపు ట్రిప్తీ ప్ర‌స్తుతం వ‌రుస‌గా క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. భూల్ భుల‌యా 3, ఆషిఖి 3, ధ‌డ‌క్ 2 చిత్రాల్లో న‌టిస్తోంది.

Tags:    

Similar News